పోలీస్ కూతురికి.. పోలీస్ నాన్న "సెల్యూట్"

Circle Inspector Shyam Sundar salutes his own daughter Jessi Prasanti.పోలీసు డిపార్ట్‌మెంట్ లో తనపై అధికారికి సెల్యూట్ చెయ్యటం మాములు . కానీ ఇక్కడ ఆ ఉన్నతాధికారి తన గారాలపట్టి.

By Medi Samrat
Published on : 4 Jan 2021 10:10 AM IST

Police Salute his own Police daughter

పోలీసు డిపార్ట్‌మెంట్ లో తనపై అధికారికి సెల్యూట్ చెయ్యటం మాములు విషయం. కానీ ఇక్కడ ఆ ఉన్నతాధికారి తన గారాలపట్టి క‌న్న‌కూతురు అయితే.? ఆ తండ్రి చేసే సెల్యూట్ లో ఆనందంతోపాటు.. ప్రేమ - గర్వం రెండూ కలగలిపి ఆ పోలీసు అధికారి కంట్లో కనిపిస్తుంది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత తాజాగా ఏపి పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో‌ నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్-2021కి "ఇగ్నైట్" అని పేరు పెట్టారు. ఇలా కూతురికి తండ్రి సెల్యూట్ చేస్తున్న అరుదైన దృశ్యానికి "ఇగ్నైట్" వేదికయ్యింది.

వివ‌రాళ్లోకెళితే.. 2018 బ్యాచ్ కి చెందిన జెస్సి ప్రశాంతి.. గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పిగా చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో "దిశ" విభాగంలో భాద్యతలు నిర్వహిస్తున్నారు జెస్సి ప్రశాంతి. ఇక‌ తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్‌ ఇంస్పెక్టర్ గా పని చేస్తున్నారు తండ్రి శ్యామ్ సుందర్.

తిరుపతి లో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో డ్యూటిలో ఉన్న తన కూతురిని చూస్తూ మురిసిపోయారు శ్యామ్. తన కూతురు తనకంటే పెద్ద ర్యాంక్ లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ.. డ్యూటీ చేస్తుండటం దూరం నుండి చూస్తూ ఆనందంగా దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు. తను కూడా వెంటనే సెల్యూట్ చేసి ఏంటి నాన్నా.. అంటూ గట్టిగా నవ్వేశారు. పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తండ్రికి ఇంతకంటే సంతోషం మరోకటి ఉండదు.

నా బిడ్డ నీతి నిజాయితీగా ప్రజలకి సేవచేస్తుందని నాకు నమ్మకం ఉందని అన్నారు సిఐ శ్యామ్ నుందర్. ఆ పోలీస్ తండ్రి, పోలీస్ కూతురిని చూసి స్పందించిన తిరుపతి ఎస్పి రమేష్ రెడ్డి.. ఇలాంటి సన్నివేశం సహజంగా సినిమాలో చూస్తుంటాం.. తిరుపతి డ్యూటీ మీట్ లో తండ్రీ, కూతురు.. ఇలా యూనీఫామ్ ధరించి ప్రజాసేవ చెయ్యటం నాకు వ్యక్తిగతం గా చాలా ఘర్వంగా ఉంది ఆల్ ది బెస్ట్ ప్రశాంతి.. అని డిఎస్పి ప్రశాంతిని అభినందించారు ఎస్పి.






Next Story