అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్‌ కార్డు తీసుకోవడం ఎలా..?

Adhar Card For New Born Baby. నవజాత శిశువు కోసం ఆధార్ కార్డుకు నమోదు చేసుకోవాలని.. ఇందుకోసం పిల్లల బర్త్ సర్టిఫికేట్ మరియు తల్లిదండ్రులలో ఒకరి గుర్తింపు కార్డు

By Medi Samrat  Published on  23 Feb 2021 8:57 AM GMT
Adhar Card For New Born Baby.

ప్రస్తుత రోజుల్లో ఆధార్‌ కార్డు అనేది జీవితంలో ముఖ్య భాగమైపోయింది. ఇప్పుడు ఏ పని చేయాలన్న ఆధార్‌ కార్డు లేనిది జరగడం లేదు. కేంద్రం కూడా అన్నింటికి ఆధారే ముఖ్యమని తేల్చడంతో ప్రతి ఒక్కరికి ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. రేషన్‌ సరుకుల నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి ఒక్కదానికి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి. ఇక ఇప్పటికే పలు ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేశాయి. ఇక ఆధార్‌ లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు. ఇక నవజాతి శుశువులకు కూడా ఆధార్‌ కావాల్సిందే. దేశంలోని కొన్ని ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన పిల్లల కోసం ఆధార్‌ కార్డు అందించే సదుపాయం సైతం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి UIDAI తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.


దేశంలో ప్రతి ఒక్కరూ ఆధార్‌ కోసం నమోదు చేసుకోవాలని UIDAI ట్వీట్ చేసింది. నవజాత శిశువు కోసం ఆధార్ కార్డుకు నమోదు చేసుకోవాలని.. ఇందుకోసం పిల్లల బర్త్ సర్టిఫికేట్ మరియు తల్లిదండ్రులలో ఒకరి గుర్తింపు కార్డు జత చేయాల్సి ఉంటుంది. నవజాత శిశువుకు కావాల్సిన ఆధార్ కోసం వారు ఎలాంటి ఫింగర్ ఫ్రింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్ డేటా అనేది 5 సంవత్సరాల పిల్లల నుంచి మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది. పిల్లలకు 5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ బయోమెట్రిక్ మార్చుకోవచ్చని తెలిపింది.

ఎలా నమోదు చేయాలి…

ముందుగా UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ కోసం లింక్ పై క్లిక్ చేయాలి.

- అనంతరం అప్లై ఫాం పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లల పేరు, మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఆధార్ కార్డు సెంటర్‏కు అపాయింట్ మెంట్ లభిస్తుంది.

- అవసరమైన సర్టిఫికేట్స్ తీసుకొని అపాయింట్ మెంట్ ఉన్న రోజు.. టైమింగ్ ప్రకారం ఆధార్ సెంటర్‏కు వెళ్ళి ఆధార్ నమోదు చేసుకోవాలి.Next Story