ముదిరిన సెల్ఫీ పిచ్చి..పెదనాన్నను చంపి సెల్ఫీ
By రాణి Published on 9 March 2020 2:38 PM IST
మార్చి 6వ తేదీ, శుక్రవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో జరిగిన ఘటన ఇది. ఏఎస్సై శివరాజ్ ను ఉట్నూర్ లో ముగ్గురు యువకులు కర్రలతో కొట్టి చంపేశారు. హత్యానంతరం వివేక్ అనే నిందితుడు ఘటనా స్థలంలోనే మృతి చెందిన వ్యక్తితో సెల్ఫీ తీసుకున్నాడు. సెల్ఫీ తీసుకున్న వ్యక్తికి మృతుడు శివరాజ్ వరుసకు పెదనాన్న అవుతాడని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
ప్రస్తుతం వివేక్ తీసుకున్న ఈ సెల్ఫీ నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీని చూసిన మృతుని బంధువులు వివేక్ తీరుపై మండిపడుతున్నారు. పెదనాన్నను హత్య చేసిన వివేక్ సెల్ఫీ తీసుకుని రాక్షసానందనం పొందాడంటూ తిట్టిపోస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. కాగా..ఆస్తి వివాదాలే ఏఎస్సై హత్యకు ప్రధాన కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read :
పెళ్లైన మూడు రోజులకే.. భార్యకు రెండు నెలల గర్భం.. విషయం తెలిసిన భర్త ఏం చేసాడంటే..
రోజురోజుకూ సమాజంలో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయి. స్ర్తీలపై అత్యాచారాలు, హత్యలు, లేకపోతే భార్య తప్పుచేసిందని పిల్లలతో సహా వారందరినీ చంపేయడం, అనుమానంతో భార్యను చిత్రహింసలు పెట్టడం, ఆస్తుల కోసం కన్నవారిని, కట్టుకున్నవారిని చంపేయడం, వావివరసలు లేకుండా అబలలపై లైంగిక దాడులు ఇలా నిత్యం అనేకానేక నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు చేసినా, ఎంతమంది నేరస్తులకు శిక్షలు విధించినా రోజురోజుకీ నేరాలు పెరుగుతున్నాయి గానీ..ఏమాత్రం తగ్గడం లేదు.