వైద్యురాలి హత్యకేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు
By Newsmeter.Network Published on 30 Nov 2019 8:42 PM ISTతెలంగాణలో వెటర్నరీ వైద్యురాలు హత్య తీవ్ర సంచనలంగా మారింది. నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, డాక్టర్ హత్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు బయటపడ్డాయి. బైక్ టైర్ పంక్చర్ చేపిస్తామని స్కూటీని తీసుకెళ్లిన ఆరిఫ్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో వైద్యురాలు తన మొబైల్ నుంచి ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. కాగా, మృతురాలు ఫోన్ ఆధారంగా మహమ్మద్ ఆరిఫ్ ఆచూకీని కనుగొన్నట్లు పోలీసులు వివరించారు. ఇక కేసు విచారణలో మృతురాలు ఫోన్ కీలక ఆధారంగా మారింది. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టులో పలు సంచలన నిజాలు వెలుగు చూశాయి. నిందితులు మృతురాలును బలవంతంగా తీసుకెళ్లే సమయంలో.. హెల్ప్ హెల్ప్ అని వేడుకున్నా నిందితులు కనికరించలేదని తేలింది. వైద్యురాలకు బలవంతంగా నోట్లో మద్యం పోసి అత్యాచారం జరిపినట్లు తేలింది. ఇలా ఒకరిపై ఒకరు మొత్తం నలుగరు అత్యాచారానికి పాల్పడినట్లు రిపోర్టులో బట్టబయలైంది. కాగా, బుధవారం రాత్రి 9.30 నుంచి 10.20 వరకు ఈ మృగాళ్లు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్పస్టమైంది.
ఆ సమయంలో మృతురాలు అరుపులు వేయడంతో నిందితులు ముక్కు, నోరు గట్టిగా నొక్కి పట్టినట్లు , ఆ సమయంలో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు తేలింది. దీంతో ఊరిపి ఆడక బాధితురాలు మృతి చెందింది. అనంతరం బాధితురాలిని ప్యాంట్ లేకుండానే లారీ క్యాబిన్ లోకి ఎక్కించి, లారీలోకి ఎక్కించి తరువాత కూడా మృతదేహంపై కూడా ఈ మృగాళ్లు పలుమార్లు అత్యాచారం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. లారీ క్యాబీన్‌ను పూర్తిగా పరిశీలించిన పోలీసులు రక్తపు మరకలు, వెంట్రుకలను సేకరించారు. షాద్‌నగర్ బ్రిడ్జ్ వద్ద బాధితురాలును కిందకు దింపాలని వారు నిర్ణయించినట్లు, బాధితురాలు బతికే ఉంటుందన్న అనుమానం రావడంతో పెట్రోల్ పోసి కాల్చివేసినట్లు తేలింది. ఈ సందర్భంగా లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు.