పాతబస్తీలోని బహదూర్‌పురా పోలీస్‌ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. శనివారం రాత్రి మహమ్మద్‌ అలియాస్‌ చోర్‌ మహమ్మద్‌ (25) అనే వ్యక్తిని మిరాలం ట్యాంక్‌ సమీపంలో ముగ్గురు గుర్తు తెలియని గుండగులు కత్తులతో వెంబడించి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, గతంలో కాలాపతర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాల కేసులో మహమ్మద్‌ ప్రధాని నిందితుడని తెలుస్తోంది. కాగా, సిద్దిక్‌, సాజిత్‌, అజర్‌ అనే ముగ్గురు కత్తులతో వెంటాడి చోర్‌ మహమ్మద్‌ను వెంటాడి హత్య చేసి పరారైనట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.