అంఫైర్‌పై టీమిండియా ఓపెన‌ర్ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌.. మ్యాచ్ ఫీజులో కోత‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Dec 2019 7:03 PM IST
అంఫైర్‌పై టీమిండియా ఓపెన‌ర్ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌.. మ్యాచ్ ఫీజులో కోత‌..!

టీమిండియా టెస్టు ఓపెనర్ మురళీ విజయ్‌కు అంపైర్లు జ‌రిమానా విధించారు. మైదానంలో అంఫైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయ‌డంతో పాటు దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఈ జరిమానా విధించారు. రంజీ సీజ‌న్ ప్రారంభ‌మ‌యిన నేఫ‌థ్యంలో తమిళనాడులోని దిండిగల్ వేదికగా కర్ణాటక, తమిళనాడు జట్ల మధ్య మ్యాచ్ మొద‌లైంది.

త‌మిళ‌నాడుకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ టీమిండియా స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో కర్ణాటక బ్యాట్స్‌మెన్ పవన్ వికెట్ల ముందు ఎల్బీగా దొరికిపోయాడు. ఫీల్డర్లతో పాటు అశ్విన్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నితిన్ ఆ అప్పీల్‌ని తిరస్కరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మురళీ విజయ్ నోటికి పనిచెప్పాడు. ఆ సమయంలో అంఫైర్ పట్ల అస‌భ్య‌క‌ర‌ పదజాలంతో దూష‌ణ‌కు దిగాడు.

దీంతో.. మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌తో మురళీ విజయ్ దూకుడుగా వ్యవహరించడంతో బీసీసీఐ క్రమశిక్షణ ఉల్లంఘన కింద మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ఇదిలావుంటే.. 2008లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన‌ మురళీ విజయ్ గతేడాది డిసెంబరులో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.

Next Story