గర్జించిన రోహిత్ సేన.. ఐపీఎల్ ఫైనల్లోకి ముంబై ఇండియన్స్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Nov 2020 9:28 AM IST
గతేడాది ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మరోమారు ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వాలిఫయర్స్-1లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై ఇండియస్స్ 57 పరుగులతో మట్టికరిపించింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌కు దిగింది.
ముంబై బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ రోహిత్ నిరాశపరిచినా.. ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51), హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 5 సిక్స్‌లతో 37 నాటౌట్) రాణించారు. దీంతో ముంబై 20 ఓవర్లలో 200/5 స్కోరు చేసింది. ఢిల్లీ భౌలర్లలో అశ్విన్ (3/29) మూడు వికెట్లు తీశాడు.
అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ స్టొయినిస్ (65) హాఫ్ సెంచరీ చేశాడు. జస్‌ప్రీత్ బుమ్రా (4/14), బౌల్ట్ (2/9) రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓడినా.. ఢిల్లీ టైటిల్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఫైనల్ బెర్త్ కోసం ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఢిల్లీ క్వాలిఫయర్-2లో తలపడనుంది. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.