ముంబైలో భూకంపం

By సుభాష్  Published on  7 Sep 2020 5:13 AM GMT
ముంబైలో భూకంపం

దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో భూకంపం సంభవించింది. గత శుక్ర, శనివారాల్లో ఉత్తర ముంబైలో భూమి కంపించినట్లు అధికారులు గుర్తించారు. తాజాగా సోమవారం ఉదయం 8 గంటలకు మరోసారి స్వల్పంగా భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదైంది. ముంబైకి ఉత్తరాన 102 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ ప్రకటించింది. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగలేదని తెలిపింది.

కాగా, శనివారం ఉదయం 6.35 గంటలకు 2.7 తీవ్రతతో ముంబైకి ఉత్తరంగా భూమి కంపించగా, అందుకు ముందు రోజు శుక్రవారం ఉదయం 10.33 గంటలకు రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 2.8తో భూమి కంపించింది. ఇక అదే రోజు 11.41 గంటలకు నాసిక్‌లో 4.0 తీవ్రతతో భూమి కంపించింది. ఇలా వరుసగా భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Next Story