ఆనంద్‌ మహేంద్ర మెచ్చిన ఆటో.. ఏం ఉన్నాయంటే..?

By Medi Samrat  Published on  10 July 2020 1:35 PM GMT
ఆనంద్‌ మహేంద్ర మెచ్చిన ఆటో.. ఏం ఉన్నాయంటే..?

సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వ్యాపార దిగ్గ‌జం ఆనంద్‌ మహేంద్ర.. సమాజంలో జరిగే ఎన్నో విషయాలపై తన అభిప్రాయాలను ట్విట్టర్‌ ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడిస్తార‌న్న విష‌యం తెలిసిందే. అలాగే ఆయ‌న‌కు నచ్చిన వీడియోలను, ఆలోచింపజేసే, మ‌న‌సుకు హ‌త్త‌కునే కొన్ని విషయాలనూ తన ఫాలోవర్స్‌తో పంచుకుంటారు.

తాజాగా అలాంటి కోవ‌కు చెందిన‌ ఒక వీడియోను ఆనంద్‌ మహేంద్ర తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో ఓ ఆటోరిక్షా క‌న‌బ‌డుతుంది. ఆటోనే కదా అందులో ఏముందని అనుకోకండి.. ఆనంద్ మ‌హేంద్ర షేర్ చేసారంటే ఖ‌చ్చితంగా దానికో ప్ర‌త్యేక‌త ఉండే ఉండే ఉంటుంది క‌దా.. అదేమిటంటే.. బ‌య‌టికి ఆటోలా మాములుగా కనిపిస్తున్నా.. అది మినీ వ్యానిటీ వ్యాన్‌లా అనిపిస్తుంది.

కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేఫ‌థ్యంలో హ్యాండ్‌వాష్‌, మాస్క్‌ తప్పనిసరి అవ‌డంతో.. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణీకులు సురక్షితంగా ఉండేందుకు ఓ ఆటోడ్రైవ‌ర్‌.. ఆటోలోనే హ్యాండ్‌వాష్‌ చేసుకునేలా సింక్‌ ఏర్పాటు చేయ‌డంతో పాటు.. సానిటైజ‌ర్ కూడా ఏర్పాటు చేశాడు. అంతేకాదు సింక్ ప‌క్క‌న‌ మొక్కలు ఏర్పాటు చేయ‌డంతో పాటు.. తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు ఆటోలో రాశాడు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ ఈ వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.Next Story
Share it