చెన్నైను వీడిన ధోని..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 March 2020 1:06 PM IST
చెన్నైను వీడిన ధోని..

కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృభిస్తుండడంతో ఐపీఎల్‌(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌ కరోనా దెబ్బకి ఏప్రిల్‌ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో చైన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని శనివారం రాత్రి చెన్నై నుంచి రాంచీకి పయనమయ్యాడు.

ఐపీఎల్‌ -13వ సీజన్‌ కోసం చెన్నైసూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్ల ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలెట్టారు. తాజాగా ఐపీఎల్‌ వాయిదా పడడంతో చెన్నై ప్రాంఛైజీ తమ ప్రాక్టీస్‌ సెషన్‌కు ముగింపు పలికింది. దీంతో కెప్టెన్‌ ధోని, అంబటి రాయుడు, సురేశ్‌రైనా లు శనివారం చెన్నైని వీడాడు. అంతకముందు చైన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు యాజమాన్యం ధోనికి వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ధోనిని చూడడానికి వచ్చిన అభిమానులతో కాసేపు ధోని సరదాగా గడిపాడు. కొందరికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్‌ ను తమ ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది. తలా మళ్లీ చెన్నై రావాలంటే.. ఐపీఎల్‌ నిర్వహణపై స్పష్టత రావాల్సిందే అంటూ రాసుకొచ్చొంది.



Next Story