437 రోజుల తరువాత బరిలోకి ధోని.. వచ్చి రాగానే రికార్డు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Sept 2020 12:23 PM IST
437 రోజుల తరువాత బరిలోకి ధోని.. వచ్చి రాగానే రికార్డు

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) ఆరంభమైంది. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయం సాధించింది. 437 రోజుల తరువాత మైదానంలో బరిలోకి దిగిన ధోని వచ్చి రావడంతోనే మరో రికార్డును అందుకున్నాడు.

ఆగస్టు 15 సాయంత్రం 7.29 గంటలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని.. సెప్టెంబర్‌ 19న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సాయంత్రం 7.30గంటలకు తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టడం యాదృశ్చికం అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై కెప్టెన్‌గా 100 మ్యాచ్‌లు గెలిపించిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.

అయితే ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీకి ఇది 105వ విజయం. చెన్నైపై నిషేధం కారణంగా 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా 5 విజయాలు అందించాడు. ఇక కెప్టెన్‌గా మహీ 175 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం. 175 మ్యాచ్‌లలో 105 విజయాలు, 69 ఓటములు ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.

మహేంద్రుడి తరువాత గౌతం గౌంభీర్‌ 108 మ్యాచుల్లో 61 విజయాలు, రోహిత్‌శర్మ105 మ్యాచుల్లో 60 విజయాలతో తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఇక విజయాల శాతం పరంగా ధోని 62శాతంతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత సచిన్‌ టెండ్కూలర్‌ 58.82, యువరాజ్‌ సింగ్‌ 58.62, వార్నర్‌ 57.82, రోహిత్‌ శర్మ 57.69 శాతం, అనిల్‌ కుంబ్లే 57.69 ఆతరువాతి స్థానాల్లో ఉన్నారు.



Next Story