భ‌ళా చెన్నై.. ఆరంభ మ్యాచ్‌లో విక్ట‌రీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2020 3:16 AM GMT
భ‌ళా చెన్నై.. ఆరంభ మ్యాచ్‌లో విక్ట‌రీ..!

ఐపీఎల్‌–2020లో ధోనీ సేన‌‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ బోణీ కొట్టింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

ముంబై జ‌ట్టులో సౌరభ్‌ తివారి (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. క్వింటన్‌ డి కాక్‌ (20 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించ‌గా.. చెన్నై బౌలర్లలో లుంగీ ఎంగ్డీ 3 వికెట్లు.. దీపక్‌ చహర్, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

అనంతరం 162 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన‌ చెన్నై సూపర్‌ కింగ్స్.. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి త‌డ‌బ‌డినా..‌ 19.2 ఓవర్లలోనే 5 వికెట్ల కోల్పోయి ల‌క్ష్యాన్ని చేధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అంబటి తిరుపతి రాయుడు (48 బంతుల్లో 71; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (44 బంతుల్లో 58 నాటౌట్‌; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 85 బంతుల్లో 115 పరుగులు జోడించి చెన్నైకి విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు.

Next Story