షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య
By తోట వంశీ కుమార్
షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఉదయం చిక్కడపల్లిలోని తన చెల్లెలి ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున ఐదు అంతస్తుల భవనం పై నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన అజయ్ కుమార్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.అజయ్ ఉస్మానియా యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
వారం రోజుల క్రితం షేక్‌పేట ఎస్‌ఐ నాగార్జున ఒకరి నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. ఇందులో సుజాత హస్తం ఉందని అధికారులు తేల్చారు. దీంతో సుజాత ఇంట్లో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. ఆమె ఇంట్లో మూడు బ్యాగుల్లో రూ.30లక్షల నగదుతో పాటు అరకిలో బంగారం, ఆస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విషయంలో సుజాతతో పాటు ఆమె భర్త అజయ్‌ను అధికారులు ప్రశ్నించారు. ఈ కేసు ఒత్తిడితోనే అజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.