ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హౌస్ అరెస్ట్‌.. ఎందుకంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Jun 2020 8:47 AM GMT
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హౌస్ అరెస్ట్‌.. ఎందుకంటే..

అధిక కరెంట్ బిల్లులపై కాంగ్రెస్ పార్టీ నేడు ఛలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ రోజు వేకువ‌జాము నుంచే కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద భారీ స్థాయిలో బ‌ల‌గాల‌ను ఉంచింది. ఈ మేర‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ విష‌‌య‌మై ఎంపీ కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ‌లో నిరంకుశపాలన సాగిస్తున్నారని పైర‌య్యారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించి అద్దె చెల్లించొద్దన్నారని.. ఇప్పుడేమో శ్లాబుల పేరుతో అధిక కరెంట్ బిల్లు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కరోనా కష్టకాలంలో ప్రజలపై ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకని కోమ‌టి రెడ్డి సీఎంను ప్రశ్నించారు. మూడు నెలలుగా ఉపాధి లేని ప్రజలు కరెంట్ బిల్లు భారాన్ని ఎలా మోస్తారని ప్రభుత్వంపై ఫైర‌య్యారు. ప్రజాసమస్యలపై పోరాడితే అరెస్ట్ చేయిస్తారా.. ఇదెక్కడి న్యాయం..? అంటూ తెలంగాణ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు.

Next Story