ఎంపీ గల్లా జయదేవ్‌కు బెయిల్
By అంజి
అమరావతి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో పాటు పలువురు రైతులపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. రైతులతో కలిసి అక్రమంగా అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నం చేసినందుకు తుళ్లూరు పోలీస్‌స్టేషన్ ఆయనపై కేసు నమోదైంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు రాజధాని ప్రాంతంలో సెక్షన్ 144, 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తునట్టు ఎస్పీ విజయరావు తెలిపారు. నిన్న అసెంబ్లీ ముట్టడి సమయంలో గల్లా జయదేవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా పలువురు రాళ్లు రువ్వారని, వారిపై కేసులు నమోదు చేశామన్నారు. రైతులతో కలిసి గల్లా జయదేవ్ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు.
మొదటగా జయదేవ్‌ను నరసరావుపేట పీఎస్‌కు తరలించి అక్కడి నుంచి రొంపిచర్ల పీఎస్‌కు తరలించారు. 143, 332, 188, 353, 323, 324 సెక్షన్ల పోలీసులు కేసు నమోదు చేశారు. జీజీహెచ్ వైద్యులతో ఎంపీ జయదేవ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా మంగళగిరి మెజిస్ట్రేట్‌ను ఆయనకు రిమాండ్ విధించారు. దీంతో జయదేవ్‌ను పోలీసులు గుంటూరు సబ్‌జైలుకు తరలించారు. అయితే మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో జయదేవ్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయవాది షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. బెయిల్ పత్రాలు గుంటూరు సబ్ జైలుకు వెళ్లిన తర్వాత గల్లా జయదేవ్ ఇవాళ సాయంత్రం లోగా విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.