భద్రత సిబ్బందిని వెనక్కి పంపించిన ఎంపీ బండి సంజయ్
By సుభాష్Published on : 22 Jan 2020 10:07 PM IST

తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత భద్రతను ఉపసంహరిచుకున్నారు. అంతే కాదు.. తనకు ఉన్న ప్రత్యేక భద్రతను వెనక్కి పంపించేశారు. కాగా, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనపై రాళ్లదాడి జరిగిందన్న నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు బండి సంజయ్‌కి ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.
అయితే బండి సంజయ్‌పై రాళ్ల దాడి జరగలేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సంజయ్ తన ప్రత్యేక భద్రతను వెనక్కి పంపించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న సంజయ్‌పై ఎలాంటి రాళ్ల దాడులు లేదని కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఏదైన దాడి జరిగి ఉంటే తాము వెంటనే స్పందించేవారమని చెప్పుకొచ్చారు. ఉద్దేశ పూర్వకంగానే రాళ్లదాడి జరిగిందంటూ తప్పుదోవ పట్టించారని ఆయన అన్నారు.
Next Story