మెగా ఫ్యాన్స్ కు దిమ్మదిరిగే షాక్ ఇవ్వనున్న 'సరిలేరు నీకెవ్వరు' టీమ్
By సుభాష్ Published on 29 Dec 2019 3:48 PM IST
ఈసారి సక్రాంతి బరిలో పోటీ అంతా ఇంతా కాదు. ఓపక్క సూపర్ స్టార్, మరో పక్క స్టైలిష్ స్టార్ ఇద్దరు పోటీతో దూసుకుపోతున్నారు. ఎవరికి వాళ్లు విజయాన్ని తమ తమ ఖాతాలో వేసుకోవాలని తెర ఆరాటపడుతున్నారు. కాగా, ఇద్దరి సినిమాలు కూడా ఒక రోజు గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఎలాగైన తామే పెద్ద హిట్ కొట్టాలని ఇద్దరూ గట్టిగా పోటీలో దిగుతున్నారు. అంతేకాదు ఈ క్రమంలో రెండు సినిమాల టీమ్‌ల మధ్య ఎప్పటిన నుంచో కోల్డ్ వార్ కూడా జరుగుతోందని సినీ ఇండస్ట్రీలో కోడై కూస్తోంది.
ఇందులో భాగంగా మొదటిసారిగా 'అల వైకుంఠపురం' చిత్ర బృందం ఓ అడుగు ముందుకేసింది. పోస్టర్లను పక్కనబెడితే ఈ సినిమా నుంచి సామజవరగమణ పాటను విడుదల చేసి కాస్త హిట్ కొట్టడంతో, అమాంతం ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తర్వాత రాములోరాముల, ఓ మైగాడ్ మై డాడీ పాటలు కూడా అందరికి ఆకట్టుకోవడంతో ప్రేక్షకులకు తమ సినిమా గురించి మాట్లాడేలా తమవైపు తిప్పుకొంది అల వైకుంఠపురం టీమ్.
మరో వైపు వీటిని పెద్దగా పట్టించుకోని 'సరిలేరు నీకెవ్వరు టీమ్' నిదానంగా తమ ప్రమోషన్లను మొదలు పెట్టింది. ఈ సినిమా నుంచి కూడా మూడు పాటలు వచ్చాయి. కానీ పాటలు పెద్దగా ఆకర్షించలేదు. ఇలా ఆడియో విషయంలో మాత్రం సరిలేరు టీమ్ వెనుకబడిందనే చెప్పాలి.
ఇక ప్రమోషన్ విషయానికొస్తే..
ఇక ప్రమోషన్ విషయానికొస్తే ప్రీ రిలీజ్ వేడుకకు తేదీ ఖరారు చేయడంతో పాటు మెగాస్టార్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించి మెగా అభిమానులకు దిమ్మదిరిగే షాక్ ఇవ్వనుందట సరిలేరు నీకెవ్వరు టీమ్. దీంతో మెగా ఫ్యాన్స్ దృష్టి ఇప్పుడు చాలా తెలివిగా తమ వైపు తిప్పుకున్నారు. అయితే విషయంలో ఇంకా బన్నిటీమ్ వెనుకాలే ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ విషయంలో 'అల వైకుంఠపురం' యూనిట్ కాస్త డైలమాలో ఉన్నట్లు సమాచారం. మహేష్ వేడుకకు చిరంజీవి ప్రధాన ఆకర్షణ అవ్వనుండగా, తమ వేడుకకు ఎవరిని పిలవాలా..? అని ఆలోచిస్తుందట మూవీ యూనిట్.
కాగా, ముందుగా బన్నీ టీమ్ చిరునే అనుకున్నారట. కానీ ఆ లోపే సరిలేరు నీకెవ్వరు నిర్మాత అనిల్ సుంకర మెగాస్టార్‌ను ఒప్పించుకోవడంతో కాస్త ఇబ్బందిగా ఫీలైనట్లు టాక్. ఈ క్రమంలో పవన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా పలువురి పేర్లను వారు పరిశీలిస్తున్నారు. ఇక పవన్ త్రివిక్రమ్ ఎలాగూ మంచి మిత్రులే కాబట్టి, ఆయన పిలిస్తే ఖచ్చితంగా వస్తాడని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో ఆయనతో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒక వేళ ఆయన రావడం కుదరకపోతే, చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరిని పిలిపించాలని అనుకున్నారట. ఎందుకంటే ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో వీరిద్దరు కలిసి నటిస్తున్న విషయం తెలిసిదే. ఆ ఇద్దరు తమ వేడుకకు వస్తే సినిమాకు మరింత క్రేజ్ రావొచ్చని ‘అల’ టీమ్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మరి మొత్తానికి చిరుకు గట్టిపోటీ ఇవ్వడానికి ఇక్కడ అల టీమ్ ఎవరినీ గెస్ట్ తీసుకు రానుందో కొద్ది రోజులు ఆగాల్సిందే. మొత్తానికి సినిమా విజయాల కన్న టెన్షన్ ప్రీరిలీజ్‌లో వచ్చే గెస్ట్ లపైనే ఎక్కవ ఆకర్షణ వెళ్తోంది.