యాక్షన్ సీక్వెన్స్ కు రెడీ అవుతోన్న 'ఆర్ఆర్ఆర్' టీం !

By Newsmeter.Network  Published on  29 Dec 2019 9:11 AM GMT
యాక్షన్ సీక్వెన్స్ కు రెడీ అవుతోన్న ఆర్ఆర్ఆర్ టీం !

జూ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యంత భారీ క్రేజీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది. ఎన్టీఆర్ - చరణ్ కలయికలో ప్రత్యర్థుల పై చేసే మొదటి యాక్షన్ సీన్స్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లోనే వస్తాయని.. అడవిలో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. మెయిన్ గా ఎన్టీఆర్ - చరణ్ ల మధ్య అనుబంధం కూడా ఈ సీక్వెన్స్ నుంచే మరో స్థాయికి వెళ్తుందట. కాగా వచ్చే వారం నుండి ఈ ఇంటర్వల్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారట.

కాగా ఇప్పటికే 85% షూట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటుల్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే లేడి విలన్ గా ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగానే ట్రై చేస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ధృడంగా ఉండే కొమరం భీంగా కనిపించేందుకు ఇప్పటికే లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కసరత్తులు కూడా చేశాడు. పైగా ఆ కసరత్తులను ఇంకా కంటిన్యూ చేస్తున్నాడట. జులై 30, 2020 లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'బాహుబలి' తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story