దిశ ఘటనపై గవర్నర్‌కి మా కమిటీ విన్నపం
By Newsmeter.Network Published on 5 Dec 2019 11:22 AM ISTహైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. డాక్టర్ ప్రియాంక హత్యోదంతంపై పలువురు స్టార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక ఆ ఘటనకు కారకులైన దోషులకు మరణదండన విధించాలని కోరారు.
దిశ హత్యచారం లాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని, దిశకు జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడదని, ఈ కేసుపై వేగంగా దర్యాప్తు జరిపి తొందరగా దోషులకు శిక్ష పడేలా చేయాలని కోరుతూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప్రతినిధులు కలిశారు.
'మా' జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్.. ఉపాధ్యక్షురాలు హేమ.. అనిత చౌదరి.. జయలక్ష్మి తనీష్, సురేష్ కొండేటి.. ఏడిద శ్రీరామ్.. రవి ప్రకాష్ తదితరులు గవర్నర్ కి విన్నవించారు.
Next Story