మునగాకు శృంగారానికే కాదు.. ఆ సమస్యలకు కూడా..
By సుభాష్ Published on 10 March 2020 8:48 PM ISTమునగాకు, మునగ కాడలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది శృంగార సమస్యలకని. చాలా మంది శృంగార సమస్యలు మాత్రమే దూరం చేస్తుందనుకుంటారు. కానీ మునగాక, కాడలు వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పచ్చిగానే కాదు వీటిని పొడి చేసి తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ మునగ ఆకులతో తయారు చేసిన టీ ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. మోరింగా టీ అని పిలిచే ఈ డ్రింక్‌తో కిడ్నీల్లో రాళ్ల సమస్య తగ్గి కొవ్వు కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు.
మనం వంటకాల్లో ఎక్కువగా మనగకాడలను వాడుతుంటాము. దీంతో వంటలకు సువానతో పాటు మంచి రుచి, ఆరోగ్యాన్నికలిగిస్తాయి. అధికంగా మునగ కాడల్ని సాంబర్, ఇతర కూరల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఈ కాడలనే కాకుండా మునగ ఆకును కూడా వంటల్లో వాడతారు. కాడలు వాడినంతగా ఆకును మాత్రం వాడరు. కానీ, మునగ ఆకు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ఇది కాలేయంలో చేరిన విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. అంతేకాకుండా మూత్రాశయంలో రాళ్లను కరిగించేందుకు మంచి ఔషధంగా పని చేస్తుంది.
అలాగే మోరింగలో అనేకమైన విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. శరీరంలో కొవ్వును కరిగించేందుకు మునగాకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మునగాక టీలలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. 'హౌ టు లూస్ బ్యాక్ ప్యాట్' అనే బుక్ ప్రకారం.. మోరింగ టీ బరువు తగ్గేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలో కొవ్వు నిల్వకు బదులుగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
మోరింగా టీని డీహైడ్రేటెడ్, గ్రౌండ్ మోరింగా ఆకుల నుంచి తయారు చేస్తారు. ఇది రక్తపోటు నియంత్రణకు ఎంతో సహాయపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. బీపీ నుంచి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది.
మధుమోహంతో బాధపడేవారికి..
మునగాకులు మధుమోహంతో బాధపడేవారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్ క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కాఫీలో కూడా ఉంటుంది. దీంతోపాటు షుగర్ లెవల్స్ లను కంట్రోల్లో ఉంచుతుంది. ఇందులో విటమిన్ -సి ఉంటుంది. అందుకే మధుమోహం-2 వారికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. అంతేకాకుండా మునగాకు టీ రోజువారిగా తాగడం వల్ల గుండెకు సంబంధిత వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది.
మునగాకులో పోషకాలెన్నో..
మునగాకులో పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఉబ్బసం తగ్గించడం, తల్లిపాలలో ఉత్పత్తి పెంచడం లాంటికి మంచి ఔషధంగా పని చేస్తుంది. మునగాకు వల్ల ఆరోగ్యానికి మేలు చేసేవి ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు.