శృంగారానికి.. నీళ్లు బాగా తాగడానికి సంబంధం ఏమిటీ..?

నిత్య జీవితంలో ప్రతీ మనిషికి నీరు తప్పనిసరిగ్గా అవసరం. నీళ్లు తాగనిదే మనిషి మనుగడ ముందుకు సాగదు. శరీరానికి నీళ్లు ఎంతో అవసరం. నీళ్లు అధికంగా తాగితే అనారోగ్య సమస్యలు దరి చేరవనే విషయం తెలిసిందే. ఇక మగవారైతే రోజుకి 3.7 లీటర్లు, ఆడవారైతే రోజుకి 2.7 లీటర్ల నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

కానీ మంచినీళ్లు బాగా తాగకపోతే శృంగార జీవితం కూడా దెబ్బతింటుందని, అదే మంచినీళ్లు ఎక్కువగా తాగితే శృంగార జీవితం ఎంతో మెరుగుపడుతుందని వైద్యులు సలహాలు ఇస్తున్నారు. నీరు తక్కువగా తాగినట్లయితే డీహైడ్రేషన్‌కు దారి తీస్తుందని చెబుతున్నారు. హైడ్రేటెడ్‌ గా లేని శరీరం ఉత్తగనే అలసిపోతుందని, ఈ కారణంగా రతిక్రీడ కొనసాగించలేరని, శృంగారం మీద ఆసక్తి ఉండదని పేర్కొంటున్నారు.

ఇక స్త్రీలు శృంగారం మొదలు పెట్టాలంటే లూబ్రికేషన్‌ చాలా అవసరం. యోని లూబ్రికేట్‌ అయితే పని సునాయాసంగా అయిపోతుంది. మంచినీళ్లు బాగా తాగితేనే ఇది సాధ్యపడుతుంది. మన శరీరంలోని మలినాల్ని, టాక్సిన్స్ ని తొలగించడానికి నీళ్లు ఎంతో దోహదపడతాయి. ఆరోగ్యకరమైన శరీరమే, అరోగ్యకరమైన శృంగారానికి సాధనం.

నీరు శృంగారానికే కాదు..మరెన్నిటికో ఉపయోగం

మంచినీళ్లు తాగడం వల్ల శృంగారానికే కాదు.. మరెన్నిటికో ఉపయోగం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. చర్మంపై మృతకణాలు తక్కువగా ఉండి, చర్మం కాంతివంతంగా, అందంగా ఉంటుంది. అలాగే శృంగార జీవితంలో ఆరోగ్యకరమైన చర్మం ఎలాంటి పాత్ర పోషిస్తుందో చెప్పనక్కరలేదు. శరీరంలో సెల్స్‌ అన్ని బాగా పని చేయాలంటే తగిన నీరు అవసరం. అందుకే నీళ్లు బాగా తాగాలి. అప్పుడే హార్మోన్‌ ఇబ్బందులు కనిపించవు. అంతేకాదు శృంగారంలో ఎలాంటి సమస్యలు ఉండకుండా అలసిపోకుండా ఉంటారని చెబుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.