ఈ నెలాఖరులో సౌదీ అరేబియాకు మోదీ..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Oct 2019 7:31 AM GMTప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి సౌదీ అరేబియాకు వెళ్లనున్నారు. ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు అంటే మొత్తం 3 రోజులు మోదీ సౌదీలో పర్యటించనున్నారు. ఈ 3 రోజుల పర్య టనలో భాగంగా సదస్సులు, సమావేశాలతో మోదీ బిజీబిజీగా గడపనున్నారు. ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనీషియేటివ్ వార్షిక సదస్సుకు సౌదీ అతిథ్యమిస్తోంది. ఈ సమిట్‌లో మోదీ పాల్గొననున్నారు. సదస్సు తర్వాత సౌదీ రాజు, యువరాజులతో మోదీ సమావేశమవుతారు. భారత్-సౌదీ మధ్య ద్వైపాక్షిక అంశాలపై వారితో చర్చిస్తారు.
అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ పలుమార్లు సౌదీలో పర్యటించారు. సౌదీతో బంధాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు పెట్టుబడులు ఆకర్షించడానికి చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మనదేశానికి వచ్చారు. పెట్రో కెమికల్స్, మౌలిక సదుపాయాలు, మైనింగ్ రంగాల్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించారు.