పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు మోదీ థాంక్స్ చెప్పారు..ఎందుకంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 8:10 AM GMT
పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు మోదీ థాంక్స్ చెప్పారు..ఎందుకంటే..?

ఛండీఘర్‌‌: పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. లోధి ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌, పలువురు మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం సుల్తాన్‌పూర్‌ లోధిలో ఉన్న సాహిబ్‌ గురుద్వారాను మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా గురుద్వారాలో ఆయన పూజలు చేశారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ దేవ్‌ 550వ జయంతి సందర్భంగా యాత్రికులు పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో గల గురుద్వారా దర్బార్‌ సాహెబ్‌ దగ్గరకు వెళ్లనున్నారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించే ముందు 500 మందికిపైగా భారత యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్‌ను ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కర్తార్‌పూర్‌ వెళ్లే బ్యాచ్‌లో మాజీ ప్రధాని మనోహ్మాన్‌ సింగ్‌, సీఎం అమరీందర్‌ సింగ్‌, పలువురు కేంద్రమంత్రులు ఉన్నారు. ఈ సందర్భంగా కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణం కోసం సహకరించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. డేరా బాబా నానక్‌ను మోదీ సందర్శించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టును మోదీ ప్రారంభించారు.

Modi

Next Story