నేను గొప్ప రాజకీయ కుటుంబం నుంచి రాలేదు: మోదీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 8:04 AM GMT
నేను గొప్ప రాజకీయ కుటుంబం నుంచి రాలేదు: మోదీ

రియాద్‌: సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా 'ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇనిషియేటివ్‌ 2019' సదస్సులో మోదీ పాల్గొన్నారు. భారత్‌లో మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాలపై అడిగిన ప్రశ్నకు మోదీ స్పందిస్తూ..'పేదరికం అంటే ఏంటో పుస్తాకాల్లో చదివి తెలుసుకోలేదు..రైల్వే ప్లాట్‌ఫాంపై ఛాయ్‌ అమ్మూతూ దాన్ని అనుభవించాను' అంటూ ఆనాటి రోజులను మోదీ గుర్తుచేసుకున్నారు.

అందుకే పేదల గౌరవం, సాధికారత లభించినప్పుడే దేశంలో పేదరికం అంతమవుతుందని వ్యాఖ్యానించారు. దీనిలో భాగంగానే పేదలకు మరుగుదొడ్లు నిర్మించటం, బ్యాంక్ ఖాతాలను తెరిపించంటం వంటి సాధికారత కల్పిస్తున్నామన్నారు. దీని ద్వారా వారికి గౌరవం లభిస్తుందని మోదీ తెలిపారు.

అయితే 'భారత్‌లో వచ్చే మార్పు ప్రపంచ వ్యాప్తంగా అంకెల్లో మార్పు తీసుకొస్తుందన్నారు. భారత్‌ను బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మార్చి..పేదరికాన్ని నిర్మూలించడం వంటి ద్వారా ప్రపంచంలోనే గణాంకాలు మారుతాయన్నారు. అయితే మోదీ ఇవాళ ఉదయం తన సౌదీ పర్యటనకు ముగించుకొని భారత్‌కు పయనమయ్యారు.

Next Story