విశాఖ ఘటనపై ప్రధాని మోదీ స్పందన
By తోట వంశీ కుమార్Published on : 7 May 2020 10:44 AM IST

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. విశాఖపట్నంలోని పరిస్థితులపై హోం శాఖ, ఎన్‌ఎమ్‌డీఏ అధికారులతో మాట్లాడారు. పరిస్థితులను పరిశీలిస్తున్నామని.. విశాఖపట్నంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటన చోటు చేసుకోవడం షాక్‌కు గురి చేసిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాయని, బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story