ఢిల్లీ: అయోధ్య పై సుప్రీం కోర్ట్ గొప్ప తీర్పును చెప్పిందన్నారు ప్రధాని మోదీ. సుప్రీం కోర్ట్ తీర్పును దేశమంతా స్వాగతిస్తుందన్నారు. అయోధ్యపై సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

“ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యపై సుప్రీం కోర్ట్ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది . ఇవాళ్టితో అయోధ్య ప్రక్రియ ముగిసింది. భారత న్యాయవవ్యస్థలో ఈ రోజు సువర్ణాధ్యాయం. భిన్నత్వంలో ఏకత్వం ఈ రోజు సంపూర్ణంగా వికసించిందన్నారు. అన్ని వర్గాల వాదనలు విన్న తరువాత సుప్రీం కోర్ట్ తీర్పు వెలువరించింది. 30 ఏళ్ల క్రితం ఇదే నవంబర్ 9 న బెర్లిన్‌ గోడ కూలింది. మీళ్లీ అదే రోజు కర్తాపూర్ కారిడార్‌ ప్రారంభమైంది. అయోధ్య కేసులో కోర్ట్ తీర్పు కూడా ఈ రోజే వచ్చింది. ” అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.