ఢిల్లీ: భారత్‌ ఐదు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి! ఇది ప్రధాని మోదీ స్వప్నం. దీనిని సాంధించటానికి ఆయన ఎంచుకున్న అనేక మార్గాల్లో ఒకటి..పశుపోషణ! దీనిపై ప్రధాని ప్రత్యేక దృష్టి సారించారు. పాడి పశువులు, మత్స్య రంగాల నిపుణులు, శాస్త్రవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. అనంతరం దీనికి సంబంధిందిన మూడు పథకాలను రూపొందించారు.

మూడు పథకాల రూపకల్పన:
ఈ పథకాల ద్వారా పశుపోషకులు ప్రస్తుతం భరిస్తున్న రూ.2.5 లక్షల కోట్లను భర్తీ చేయడమే కాకుండా..వారి ఆదాయం 4 రెట్లు పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. పాడి, పశువుల రైతులకు రూ.13వేల కోట్ల ప్రయోజనం కలిగే పథకాలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.

జీడీపీకి ఊతం:
పశుపోషణ జాతీయ స్థూల ఉత్పత్తికి ఊతమిస్తుందని కేంద్ర పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల శాఖ కార్యదర్శి అతుల్ చతుర్వేది పేర్కొన్నారు. 2024 నాటికి పశు సంపంద నాలుగురెట్లు పెంచడమే లక్ష్యంగా కేంద్రం పెట్టుకుందన్నారు.
ప్రపంచంలోనే పశుపోషణ రంగం వృద్ధికి అత్యధిక పథకాలు రూపొందించామని చెప్పారు. 2024 నాటికి పాడి, పశువలు పెంపక దారుల ఆదాయం నాలుగు రెట్లు అవడం ఖాయం అని మోదీ ధీమాగా ఉన్నట్లు తెలిపారు.

టాప్‌ 15లో కూడా భారత్‌ లేదు..!
భారతదేశం ప్రపంచంలోనే పాడి, పశువులు పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ..పాలు-పాల ఎగుమతుల్లో వెనుకబడూ ఉన్నాం. కనీసం టాప్‌ 15లో కూడా భారత్‌కు చోటు లేదు. వేరే దేశాలతో పొలిస్తే భారత్‌లోని ఆవులు, గేదెలతో నాలుగోవంతు పాలు ఇవ్వలేవు.

వ్యాధులే కారణం:
మన దేశంలో పాల దిగుబడి గరిష్టంగా లేకపోవడానికి కారణం..పాడి పశువులకు ‘గాలికుంటు’తోపాటుగా రకరకాల వ్యాధుల బారిన పడటమే. మన కొట్టాల్లో పరిశుభ్రత తక్కువగా ఉండటం..మేలు జాతి పశువులు లేకపోవడం. ఇదే పశువులను వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. పాల ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం చూపుతోంది.

దేశీ ఆవులకు సుప్రీం రక్ష!
దేశీయ ఆవులను కబేళాల్లో వధించడాన్ని నిషేధించాలని..దాఖలైన పిటిషన్‌పై సుప్రీం స్పందించింది. దీనిపై అక్రమ కబేళాలను మూసివేయాలని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ ఆదేశించింది.

కాగితాలకే పరిమితం!
అయితే దేశవాళీ పశువుల సంఖ్య 2012-19 మధ్య 6 శాతం తగ్గింది. దీని ద్వారా ఈ ప్రభుత్వానికి గోవులపై ప్రేమ కాగితాలకే పరిమితమని అర్థమవుతోంది.

8 స్థానంలో తెలంగాణ..
పశుసంపద వృద్ధిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా రాషంలో గొర్రెల సంఖ్య పెరిగింది. కానీ ఆవులు, ఎడ్ల సంఖ్య 13.20 శాతం తగ్గిపోవడం ఆందోళనకరం. అయితే కేంద్ర తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలైలో పశుగణన పూర్తయింది. తుది నివేదికను రూపొందించకపోయినా పశువుల సంఖ్యపరంగా తెలంగాణ 8 స్థానంలో ఉందిని కేంద్రం వెల్లడించింది

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.