మోదీ ప్రభుత్వం పౌరుల‌కు సంబంధించిన డేటాను సేకరించే పనిలో నిమగ్నమై ఉందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 March 2020 10:10 AM GMT
మోదీ ప్రభుత్వం పౌరుల‌కు సంబంధించిన డేటాను సేకరించే పనిలో నిమగ్నమై ఉందా..?

మోదీ ప్రభుత్వం 1.2 బిలియన్ల ప్రజలకు సంబంధించిన డేటాను సేకరించే పనిలో ఇప్పటికే నిమగ్నమై ఉందా..? అది కూడా ఈ పని చివరిదశలో ఉందా..! ప్రజలకు సంబంధించిన సమగ్ర సమాచారం.. ఏమేమి చేతున్నారో మొత్తం ఆటో-అప్డేట్ అవ్వబోతుందా..! ప్రజలకు సంబంధించిన మునుపటి డాక్యుమెంట్లను రివ్యూ చేసిన HuffPost India సంచలన విషయాలను వెల్లడించింది.

2011 లో నిర్వహించిన సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్(ఎస్.ఇ.సి.సి.) ద్వారా సేకరించిన డేటా కారణంగా ప్రభుత్వానికి సంబంధించిన స్కీములు సరైన వ్యక్తులకే చేరుతున్నాయా లేదా అన్నది తెలుస్తుంది. నేషనల్ సోషల్ రిజిస్ట్రీ ఇప్పటికే ఈ సర్వే వలన ఎవరికీ ఇబ్బంది ఉండదని తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కు కూడా డేటా అందించడం ఎస్.ఇ.సి.సి. బాధ్యత అని తెలుస్తోంది.

డేటా అండ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ రీసెర్చర్ శ్రీనివాస్ కొడాలి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కొన్ని పత్రాలను సేకరించారు. కానీ ఎస్.ఇ.సి.సి. ఆటోమేటిక్ గా డేటాను రియల్ టైమ్ లో అప్డేట్ చేస్తోందట. ఆధార్ సీడెడ్ డేటా బేస్ లేదా బహుళ డేటాబేస్ ల నుండి ఆధార్ కార్డు నంబర్ లను సేకరించి ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారమైన మతం, కులం, ఆదాయం, ప్రాపర్టీ, చదువు, పెళ్లి అయ్యిందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, వికలాంగుడు అవునా కాదా, కుటుంబానికి సంబంధించిన సమగ్ర డేటా ప్రతి ఒక్క పౌరుడి నుండి సేకరించే అవకాశం ఉందట.

నేషనల్ సోషల్ రిజిస్ట్రీ డాక్యుమెంట్ల ప్రకారం దారిద్య్ర రేఖ దిగువున ఉన్న కుటుంబాలకు సంబంధించిన డేటా మాత్రమే కాకుండా ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించిన డేటాను ప్రభుత్వం తీసుకుంటోంది.

భారత జనాభా లెక్కల యాక్టు 1948 ప్రకారం ఒక్కొక్కరికి సంబంధించిన వివరాల విషయంలో గోప్యత అన్నది ఉండాలి. కానీ ఎస్.ఇ.సి.సి. విషయంలో అలాంటివేమీ లేదని తేలింది.

ఎస్.ఇ.సి.సి. ఇచ్చే డేటా ప్రకారం ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించిన కదలికలను తెలుసుకోవచ్చని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. పౌరుడు నగరాలు మారినా, ఉద్యోగాలు మారినా, కొత్తగా ఒక ప్రాపర్టీ కొన్నా, కుటుంబంలో ఎవరైనా పుట్టినా, చనిపోయినా, అత్తారింటికి వెళ్లినా ఆటోమేటిక్ గా ఈ డేటా అంతా ఎస్.ఇ.సి.సి. వద్ద ఉండేలా చూడాలని డేటా బేస్ ను తయారు చేయనున్నారు. సరికొత్త డేటా బేస్ ల ద్వారా మొత్తం సమాచారాన్ని సేకరించి విభిన్నమైన డేటాబేస్ లలో పొందుపరచాలని భావిస్తున్నారు. అక్టోబర్ 4, 2014 న నిర్వహించిన మీటింగ్ లో నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రెటరీ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఇంటికీ జియో ట్యాగింగ్ లింక్ చేయాలని ఇస్రో రూపొందించిన వెబ్ బేస్డ్ జియో స్పేషియల్ పోర్టల్ లో ఉంచాలనే ప్రతిపాదనను తీసుకుని వచ్చారు.

ఇదంతా వీలయ్యే పని కాదని మనము అనుకోవచ్చు. కానీ భారత ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన పనిని మొదలుపెట్టిందని హఫ్ పోస్ట్ ఇండియా బయటపెట్టింది.

ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. 2021 లో సోషల్ రిజిస్ట్రీని ఆచరణలో పెట్టాలని భావిస్తోంది. కమిటీ పైలట్ ప్రాజెక్టుగా ఏదైనా ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవాలని పావులు కదుపుతోంది.

ఆధార్ కార్డ్ యాక్ట్ కు సంబంధించి 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకోకుండా కొన్ని మార్పులు చేయాలని చూస్తోంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా( UIDAI) అక్టోబర్ 4 నిర్వహించిన మీటింగ్ ఆధారంగా కొన్ని మార్పులు చేయాలని చూస్తోంది. అలా చేస్తే 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విలువ లేనట్లే.

UIDAI ఇప్పటికే 'డేటా ఎక్స్ చేంజ్ ఫ్రేమ్ వర్క్' కు సంబంధించి వందల సంఖ్యలో ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకి సంబంధించిన డేటా బేస్ లను జల్లెడ వేసింది. దీని ద్వారా డేటా అన్నది సులువుగా సేకరించవచ్చని తెలుస్తోంది.

1

జూన్ 17, 2019 నాడు విడుదల చేసిన నోట్ ప్రకారం ప్రపంచ బ్యాంకు కూడా ఇందుకు సహకారం అందిస్తామని తెలిపింది. నాన్ లెండింగ్ టెక్నికల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద 2 మిలియన్ డాలర్ల సహాయం అందించింది.

ఇదంతా భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా 'నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజెన్స్' గురించి బహిరంగంగా మాట్లాడుతున్న సమయంలోనే చోటుచేసికుంది. దేశంలోకి చొచ్చుకుని వచ్చిన వాళ్ళను ఏరిపారేస్తామని ఆయన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎలా ఏరి పారేస్తారు అన్న విషయానికి ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు.

2

రిజిస్ట్రీ ప్రస్తుతం ఉన్న దశలోనే అమలు చేస్తే ప్రమాదకరం అని ప్రైవసీ ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వం విభిన్న తరహా ఆల్గరిథమ్ లను ఉపయోగించి డేటాను సేకరించి అందులో నుండి దేశ ప్రజలు ఎవరు.. విదేశీయులు ఎవరు అన్నది తెలుసుకోవాలని అనుకుంటోంది.

దాదాపు దశాబ్దకాలంగా ఎస్.ఈ.సి.సి. ప్రజలను జల్లెడ వేయడానికి కొనసాగిస్తోంది. పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి.. పేదరికంలో ఉన్నారా లేదా.. లాంటివన్నీ గమనిస్తూనే ఉంది. వరల్డ్ బ్యాంకు లాంటి సంస్థలు కూడా ఇలాంటివాటిపై సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటాయి. పెద్ద ఎత్తున సర్వేలైన్స్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్కరి డేటా ప్రభుత్వానికి అందడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

యేల్ లా స్కూల్ లో ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రాజెక్టు చేసిన చిన్మయి అరుణ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆచరించాలని అనుకుంటున్న ఈ నిర్ణయంపై సందేహాలు వ్యక్తం చేశారు. అరుణ్ మాట్లాడుతూ సర్వేలైన్స్ విషయంలో చిన్నపాటి తప్పులు చేసినా పెద్ద ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఇలాంటి విషయాల కారణంగా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని అన్నారు.

డైనమిక్ రిజిస్ట్రీ

2011 లో అప్పటి భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మొదటిసారి కుల ప్రాతిపదికన జనాభా లెక్కలు తీసుకురావాలని అనుకుంది . 2011 లో ఎస్.ఇ.సి.సి. కుల ప్రాతిపదికన ప్రతి ఒక్క భారత పౌరుడికి సంబంధించిన డేటాను సేకరించారు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కో-ఆర్డినేట్ చేస్తున్న ఈ ప్రాజెక్టును మొత్తం మూడు ప్రభుత్వ ఏజెన్సీలు కలిసి నిర్వహించాయి.

గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పట్టణ ప్రాంతాల ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ మరియి అర్బన్ పావర్టీ అల్లివేషన్, పొలిటికల్ గా చాలా సెన్సిటివ్ అయినా కులాలకు సంబంధించిన సమాచారాన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిజిస్టర్ జెనరల్ ఆఫ్ ఇండియా(ఆర్జిఐ), సెన్సస్ కమీషనర్ ఆఫ్ ఇండియా చూసుకున్నాయి.

2015, జులై 3న, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎస్.ఇ.సి.సి. దగ్గరున్నటువంటి ఎకనామిక్ డేటాను బహిర్గతం చేసింది. కానీ కులాలకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టలేదు.

చాలా ఏళ్ల పాటూ కొన్ని కోట్ల కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువగానే ఉన్నట్లు చెప్పుకుంటూ వచ్చారు. కానీ అందుకు సంబంధించిన పక్కా సమాచారం మాత్రం అప్డేట్ చేయడంలో విఫలమవుతూ వచ్చారు. ఎస్.ఇ.సి.సి. మాత్రం ఫైనాన్షియల్ గా చాలా మందికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు ఎవరు అర్హులో వారికి మాత్రమే దక్కేలా చేయాలని భావించింది. ఉదాహరణకు కుటుంబానికి సంబంధించిన ఆదాయాన్ని బేరీజు వేసుకుని పిల్లలకు స్కాలర్ షిప్ లు, లోన్ లు ఇవ్వడం, చిన్నపాటి బిజినెస్ లను మొదలుపెట్టడానికి సహాయ సహకారాలు అందించే వీలు ఉంటుంది.

అప్పటి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ చౌదరీ బీరేందర్ సింగ్ ఎస్.ఇ.సి.సి. గురించి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ దశ నుండి ప్రజల ఆర్థిక లావాదేవీలు తెలుసుకునే అవకాశం ఉంటుందని, అర్హులకు సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా అన్నారు. అక్టోబర్ 13, 2015 లో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సోషల్ రిజిస్ట్రీని అమలు చేద్దామన్న ప్రతిపాదననువు కేంద్రం ముందు ఉంచింది. ఎస్.ఇ.సి.సి. డేటా ద్వారా ఎక్కువ మొత్తంలో ఉపయోగాలు ఉంటాయని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నవంబర్ 2015 లో రూపొందించిన ఫైల్ ను హఫ్ పోస్ట్ ఇండియా రివ్యూ చేసింది.

నవంబర్ 27, 2015 లో అప్పటి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎకనామిక్ అడ్వైజర్ మనోరంజన్ కుమార్ ఎస్.ఇ.సి.సి. కి సంబంధించిన సంపూర్ణ ప్రక్రియను బయటపెట్టారు. ఎస్.ఇ.సి.సి. అన్నది ఎప్పటికప్పుడు డేటాను అప్డేట్ చేస్తూ ఉంటుందని ఆయన అన్నారు. అలా ఎప్పటికప్పుడు ఎస్.ఇ.సి.సి. అన్నది డైనమిక్ సోషల్ రిజిస్ట్రీగా అప్డేట్ అవ్వాలని కుమార్ తన నోట్ లో పొందుపరిచారు. సిస్టమ్ అన్నది ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలని కుమార్ జూనియర్ ధృవ్ కుమార్ సింగ్ సలహా ఇచ్చారు.

3

ఎప్పటికప్పుడు అప్డేట్ అన్నది జరుగుతూ ఉంటే లబ్ధిదారుల విషయంలో మార్పులు అన్నవి జరుగుతూ ఉంటాయని.. కొత్త కొత్త వారు లబ్ది పొందే అవకాశం ఉందని తెలిపారు. ఒక కుటుంబం అన్నది ఎప్పుడైతే లబ్ది పొందే అవకాశాన్ని దక్కించుకుంటుందో అప్పుడు ఆ విషయం ప్రభుత్వానికి తెలిసి సహాయం చేయడం చాలా ఈజీ అవుతుందని ఆయన అన్నారు.

ఇక కొన్ని కుటుంబాలు ఓ వైపు గ్రామాలలో ఉంటూనే.. మరికొన్ని సార్లు నగరాలకు వెళుతూ ఉంటాయి. ఇటువంటి కుటుంబాలకు సంబంధించిన డేటాను సేకరించడం ప్రభుత్వానికి కాస్త కష్టతరమే. ఇటువంటి డేటాబేస్ ను ఉపయోగించి ఆధార్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తే ప్రతి ఒక్క భారతీయుడి సమాచారాన్ని పొందుపరచడం పెద్ద కష్టం కాదని కుమార్ చెప్పారు.

మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ ఆర్గనైజేషన్ కు చెందిన నిఖిల్ డే మాట్లాడుతూ.. లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం ఇంకా పారదర్శకతను తీసుకుని రావాలని.. తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వ స్కీమ్ లను సొంతం చేసుకునే వారిని అరికట్టాలని అన్నారు. ఆధార్ డేటా ద్వారా సమాచారం వేరే వ్యక్తులకు చేరే అవకాశం ఉందని కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

గమనిస్తూనే ఉన్నారా..?

కుమార్ నోట్ ను పరిగణలోకి తీసుకుంటే అయిదేళ్ల కాలంలో ప్రతిరోజూ సమాచారం అన్నది అప్డేట్ అవుతూనే ఉంది. వివిధ డిపార్టుమెంట్లు, మినిస్ట్రీలు, నీతి ఆయోగ్ కు సంబంధించిన డేటా, యుఐడిఏఐ కు ఎప్పటికప్పుడు ప్రపంచ బ్యాంకు సలహాలు, సూచనలు అందిస్తూనే ఉంది. డైనమిక్ డేటా బేస్ అన్నది ప్రభుత్వ సహాయం కోసం ఎంతగానో ఉప్పయోగపడుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రభుత్వం దగ్గర ఉండడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.

మాజీ ఫైనాన్సియల్ సెక్రెటరీ సుమిత్ బోస్ అధ్యక్షతన 2016, జనవరిలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఒక ఎక్స్పర్ట్ టీమ్ ను ప్రతిపాదించింది. అప్పటి కమిటీలో ఉన్న సభ్యులు చెప్పడం ప్రకారం.. ఇప్పటి డేటాబేస్ కు అప్పుడు వారు రూపొందించిన దానికి చాలా తేడా ఉందని తెలిపారు. సోషల్ రిజిస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు.

ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీకి చెందిన ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ హిమాన్షు మాట్లాడుతూ మొత్తం ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం అన్నది తాము ప్రతిపాదించలేదని తెలిపారు. 2016 లోని సుమిత్ బోస్ టీమ్ లో హిమాన్షు కూడా సభ్యుడే. తాము చెప్పింది ఏయే కుటుంబం లబ్ది దారుల కిందకు వస్తారో.. వారికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే సేకరించాలని అనుకున్నామని.. కానీ ప్రభుత్వం ఆ తర్వాత తమను సంప్రదించలేదని హఫ్ పోస్టు ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

2016 మార్చి నెలలో ప్రభుత్వం నీతి ఆయోగ్ కమిటీ సలహాలు కూడా తీసుకుంది. కుటుంబానికి సంబంధించిన 'ఫ్యామిలీ ట్రీ' సమాచారాన్ని పొందుపరిస్తే మంచిదని ప్రభుత్వానికి తెలియజేసిందని సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎస్.సి.ఝా మే 13, 2016న రూపొందించిన నోట్ లో తెలియజేసారు. పుట్టుకలు, చావులు, పెళ్లిళ్లు లాంటి సమాచారాన్ని పొందుపరిస్తే మంచిదని మే 20, 2016న మినిస్ట్రీ డైరెక్టర్ ధృవ్ కుమార్ సింగ్ ప్రవేశపెట్టిన నోట్ ద్వారా మనకు తెలుస్తుంది.

4

ఆ తర్వాత ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంకు కు మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. మార్చి, 2017 న మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులు వరల్డ్ బ్యాంకు ఇచ్చిన సలహాల పట్ల అసహనం వ్యక్తం చేశారు. రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి చెందిన మనోరంజన్ కుమార్ మాట్లాడుతూ వరల్డ్ బ్యాంకు ప్రతిపాదించిన చాలా అంశాలలో ఎన్నో లొసుగులు ఉన్నాయని అన్నారు. అమెరికాకు సంబంధించిన సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ ను దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు.

2017 జూన్ లో ఇంటర్ మినిస్ట్రియల్ ఎక్స్పర్ట్ కమిటీ ఎస్.ఇ.సి.సి. 2011 డేటాకు సంబంధించిన సమాచారంపై రివ్యూ కమిటీని పెట్టారు. యుఐడిఏఐ, వరల్డ్ బ్యాంకు, నేషనల్ ఇంఫార్మేటిక్స్ సెంటర్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, సెంటర్ ఫార్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇల్యూషన్స్ కు సంబంధించిన సభ్యులు ఇందులో ఉన్నారు. జూన్ 2017, అక్టోబర్ 2019 మధ్య ఈ కమిటీ నాలుగు సార్లు మీట్ అయ్యింది. హఫ్ పోస్ట్ ఇండియా అడిగిన పలు ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి యుఐడిఏఐ, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, రిజిస్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా నిరాకరించాయి.

డేటా అన్నది ఎక్కడ మిస్ యూజ్ అవుతుందా అన్న విషయంపై వరల్డ్ బ్యాంకు తెగ భయపడింది. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఇలా డేటా అన్నది లీక్ అయ్యిందో వాటికి సంబంధించిన ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించిన సమాచారం చాలా ముఖ్యం అని సూచించింది. ప్రభుత్వానికి సమర్పించిన సూచనలకు సంబంధించిన డేటాను బహిర్గతం చేయడానికి ప్రపంచ బ్యాంకు నిరాకరించింది.

మార్చి 5, 2018న ఎస్.ఇ.సి.సి. ని అప్డేట్ చేయడాన్ని ఆపాలని సూచించారు. రిజిస్ట్రీని ఎప్పుడు తయారుచేశారు.. అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కడ ఉంచారన్నదే పెద్ద ప్రశ్నగా మారింది.

ది ఆధార్ ఎఫెక్ట్

సోషల్ రిజిస్ట్రీ పూర్తిగా తమ పనిని ఆపలేదు. ఆధార్ కు సంబంధించిన సమాచారం ప్రకారం.. మొత్తం డేటా బేస్ నుండి ఒక్కొక్కరిని కనుక్కోవడం చాలా సులువుగా మారినట్లే. ఫోన్ నంబర్, పాన్ నంబర్ ల ఆధారంగా ఒక్కో వ్యక్తిని కనుక్కోవడం చాలా సులువుగా మారింది. దీంతో ప్రైవసీ ఎక్స్పర్ట్స్ ఒక్కొక్కరిగా సుప్రీం కోర్టును ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఆధార్ అనుసంధానం ద్వారా సోషల్ రిజిస్ట్రీలో ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించిన సమాచారం తెలిసిపోతోందని ఆరోపించారు. ప్రైవసీ ఎక్స్పర్ట్స్ అనుకున్నదే నిజమైంది. యుఐడిఏఐ కారణంగా డేటా అన్నది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోందని తెలిసింది.

యుఐడిఏఐ మాత్రం ప్రైవసీ ఎక్స్పర్ట్స్ చెప్పింది పూర్తిగా తప్పని సుప్రీం కోర్ట్ కు తెలిపారు. ఒక్క వ్యక్తిని ఆధారంగా చేసుకుని పిటీషనర్లు మొత్తం తప్పుబడుతున్నారని.. ఆధార్ ద్వారా మొత్తం సమాచారం సేకరించడం వీలుకాదని తెలిపింది. ఆధార్ సమాచారంతో ప్రభుత్వం ఏమి చేయగలదు.. చేయలేదన్నది ఎవరూ ఊహించలేమని ప్రొఫెస‌ర్ అనుపమ్ సరాఫ్ తెలిపారు. మొత్తం 32 పిటీషన్లు ఆధార్ కు వ్యతిరేకంగా వేశారని ఆయన అన్నారు. ఈ మొత్తం పిటీషన్లను సుప్రీం కోర్టు ఒక్క పిటీషన్ లా మార్చి కేసు విచారణ మొదలు పెట్టింది. కానీ 32 పిటీషన్లను ఒక్కొక్కటిగా రీఓపెన్ చేయాలని ఆయన అన్నారు. 2018 సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు ఆధార్ విషయంలో తన తీర్పును ఇచ్చింది. ఆధార్ తప్పనిసరి కాదంటూ తీర్పును ఇచ్చింది.

2019, ఏప్రిల్ నెలలో మినిస్ట్రీ ఆఫ్ రురల్ డెవలప్మెంట్ పైలట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి ఆధార్ మాత్రమే కాకుండా వివిధ రకాల డాక్యుమెంట్ల ద్వారా కూడా ఎస్ఈసిసి డేటాను అప్డేట్ చేయాలని చూసింది. దీంతో ఆధార్ యాక్ట్ లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావించింది కూడా..! జూన్ 2019లో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కొన్ని మార్పులు సూచింది.

అక్టోబర్ 4, 2019 న నాలుగవ సారి ఇంటర్-మినిస్ట్రియల్ ఎక్స్పర్ట్ కమిటీతో మీటింగ్ నిర్వహించారు. 2016 ఆధార్ రెగ్యులేషన్స్ కు సంబంధించి కొన్ని మార్పులు కూడా సూచించారు. ఇదే కానీ జరిగితే సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుకు విలువలేనట్లే. ఆధార్ కు సంబంధించిన డేటా లాగ్స్ ఇతరులకు చేరినా.. ఆధార్ కార్డు హోల్డర్ కు సంబంధించిన బయో మెట్రిక్స్ లాంటివి ఇతరులకు చేరకుండా చర్యలు సూచించాలి.

5

అక్టోబర్ 2019 మీటింగ్ ప్రకారం మొత్తం సమాచారాన్ని సోషల్ రిజిస్ట్రీలో పొందుపరచడం చాలా కష్టమని చెబుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలకు సమాచారాన్ని అందించడం అన్నది ప్రతి ఒక్క పౌరుడికీ ఇష్టం ఉండకపోవచ్చని చెప్పుకొచ్చారు.

6

డేటాకు సంబంధించిన సమాచారం ఇతరులకు చేరకూడదంటే డేటా విషయంలో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోవాలి.. అదంతా చట్ట పరిధిలోనే జరగాలి. ఏదైనా ముఖ్యమైన అవసరం ఉంటేనే ప్రజలకు సంబంధించిన డేటాను ప్రభుత్వం కోరాలి. ప్రభుత్వానికి కీలకమైన అంశాలను బేరీజు వేసుకునే డేటాను అడగాలని ప్రైవసీ లాయర్ ఎస్ ప్రసన్న ప్రతిపాదించారు. ఒక విషయానికి సంబంధించి డేటాను సేకరించి.. మరొకదానికి ఉపయోగించడం చాలా తప్పని.. అలాంటపుడు డేటా-షేరింగ్ అన్నదే తప్పుడు దారిలో ఉన్నట్లని అన్నారు.

2022 అతి ముఖ్యమైనది

పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం సోషల్ రిజిస్ట్రీపై పెద్ద ఎత్తునే దృష్టి పెట్టింది. సోషల్ రిజిస్ట్రీకి మూల కారకుడైన మనోరంజన్ కుమార్ రిటైరైనప్పటికీ ఆ తర్వాత వచ్చిన నాయకులు, అధికారులు దాన్ని కొనసాగించారు. సోషల్ రిజిస్ట్రీ ఇన్ఫర్మేషన్ సిస్టం ఎస్.ఈ.సి.సి. డేటాను ఎప్పటికప్పుడు బలపరుస్తూ వెళుతోంది. డేటాలో ఖచ్చితత్వం, ప్రామాణికత్వం, సరైన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ పథకాలకు ఎవరైతే అర్హులో వారికి అందించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా 'న్యూ ఇండియా 2022' అంటూ రూపొందించిన ఈ పథకం ద్వారా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రటరీ బిశ్వజిత్ బెనర్జీ జూన్ 17, 2019న రూపొందించిన నోట్ ద్వారా తెలుసుకోవచ్చు. 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రం జరుపుకునే సమయానికి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

- ఈ వ్యాసం రిపోర్టర్స్ క‌లెక్టివ్ ద‌ర్యాప్తులో భాగంగా కుమార్ సంభ‌వ్ శ్రీ వాస్త‌వ్ 'హంఫింగ్‌ట‌న్ పోస్టుకు రాసింది. న్యూస్‌మీట‌ర్ తెలుగుకి ప్ర‌త్యేకంగా అందించ‌డ‌మైంది.

Next Story