ప్రతి ఇంట దీపజ్యోతులను ప్రజ్వలింపజేద్దాం.. కరోనాపై యుద్ధ స్ఫూర్తిని వెలిగిద్దాం

By సుభాష్  Published on  5 April 2020 11:26 AM GMT
ప్రతి ఇంట దీపజ్యోతులను ప్రజ్వలింపజేద్దాం.. కరోనాపై యుద్ధ స్ఫూర్తిని వెలిగిద్దాం

కరోనా మహమ్మారికి మందు లేదు. కరోనాకు మతాలు, కులాలు లేవు. కరోనా కాటుకు ధనిక, పేద అనే తేడా లేకుండా కాటేస్తోంది ఈ కరోనా మహమ్మారి. ఈ కరోనా కాటుకు దేశాలు అనే తేడా లేదు. ఈ యుద్ధంలో మన కంటికి కనిపించని వైరస్‌ను తరిమికొట్టడమే మన ముందున్న లక్ష్యం. ఈ వైరస్‌కు వ్యతిరేకంగా మనమందరం పోరాటం చేస్తున్నాం. ప్రతి ఒక్క అడుగు తోడై సామూహికంగా గెలిచి తీరాల్సిన సమయం ఇది. అందరం ఐక్యంగా ఉన్నామని దేశానికి, ప్రపంచానికి చాటిచెబుతాం.

ప్రతి ఒక్కరిలో ఒంటరి భావాన్ని పోగొట్టడం ఎంతో అవసరం. నేటి సంకల్పంతో దేశంలో 130 కోట్ల మంది మనకు తోడుగా ఉన్నారని సంఘాభావాన్ని చాటుదాం. దేశంలో ఇంతటి యుద్ధం చేస్తున్న సమయంలో ఈ అద్భుతమైన సమైక్య శక్తి ప్రజల రూపంలో నిరూపితమవుతుందని భావిద్దాం. ఈ భవనే మనలో ధైర్యాన్ని నింపి సామూహిక లక్ష్యం వైపు పయనించేలా చేస్తుంది. అంతేకాదు కరోనా మహమ్మారి చీకట్ల నుంచి కాంతి రేఖ కనబడుతుందన్న ఆశాభావంతో ముందుకు సాగుదాం. అందరు కలిసి చేస్తేనే వెయ్యి ఏనుగుల బలం కలిగిస్తుందన్న మాటను నిజం చేద్దాం.

దేశంలో కరోనా కొరలు చాస్తుండటంతో దానిని తరిమికొట్టేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంట్లో లైట్లన్నీ ఆర్పివేసి దీపాలు, కొవ్వొత్తులు, టార్చిటైల్లు, లేదా మొబైల్‌ ఫ్లాష్‌ ఆన్‌చేసి మన సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం.

Next Story