ఎమ్మెల్యే కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్య

By సుభాష్  Published on  21 March 2020 2:54 PM IST
ఎమ్మెల్యే కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్య

రాజస్థాన్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యే సురేష్‌ ధక్కడ్‌ కుమార్తె జ్యోతి (24) ఆత్మహత్యకు పాల్పడింది. రాజస్థాన్‌లోని బరన్‌ జిల్లాలో తన అత్తగారి ఇంట్లో శుక్రవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి భర్త డాక్టర్‌ జైసింగ్‌. ఇతను రాజస్థాన్‌లోని వైద్య విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె ఉరి వేసుకున్న గదిలో మాత్రం ఎలాంటి లేఖ లభించలేదని, ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా, సురేష్‌ ధక్కడ్‌ మధ్యప్రదేశ్‌లోని పొహారీ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆయన ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సభ్యుల్లో ఒకరు.

Next Story