వైసీపీ ఎమ్మెల్యే ఎస్కార్ట్ వాహనం బోల్తా
By సుభాష్ Published on 25 Jan 2020 8:42 AM IST
ఏపీ ప్రభుత్వ విప్, చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం బోల్తాపడింది. భాస్కర్ చెన్నై వెళ్తుండగా చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను తిరుపతిలోని ఆస్పత్రికి తరలించారు.
కాగా, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ వాహనానికి ముందు వాహనంలో ఉన్నారు. ఈ వాహనం బోల్తాపడటంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహయంతో వాహనాన్ని పక్కకు తొలగించడంతో రహదారి క్లీయర్ అయింది.
Next Story