మియాపూర్‌లో కారు బీభత్సం.. ఒక‌రి మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Feb 2020 6:30 AM GMT
మియాపూర్‌లో కారు బీభత్సం.. ఒక‌రి మృతి

హైదరాబాద్ నగర శివారు మియాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వెళ్తూ అదుపుతప్పి విధ్వంసం సృష్టించింది. రోడ్డుపై ఉన్న వాహనాల‌ను ఢీకొట్ట‌డ‌మే కాకుండా.. అదే వేగంతో ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్‌లో కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న‌లో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయ‌ప‌డ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘ‌ట‌న‌లో మృతిచెందిన అఫ్జల్‌ ఓ ప్రయివేటు పాఠశాల కరస్పాండెంట్‌. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన‌ సంతోష్‌ మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హ‌ఠాత్తు ప‌రిణామంతో అక్క‌డ‌ వాహనదారులు హడలిపోయారు. పాద‌చారులు ప‌రుగులు పెట్టారు. పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని కారును హోటల్ నుంచి బయటకు తీశారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it