మిథాలీ రాజ్ గా తాప్సీ : మహిళా విజయాలపై మరో సినిమా

డిసెంబర్ 3, 1982… అది మన మహిళా సచిన్ మిథాలీ రాజ్ పుట్టిన రోజు. భారతీయ క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మహిళా క్యాప్టెన్. బరిలో దిగితే బౌండరీలు కురిపించే బ్యాటింగ్… అద్భుతమైన ఫీల్డింగ్ … ఇవన్నీ ఆమె సొంతం. మిథాలీ రాజ్ ఒక పెద్ద ఎచీవర్. అవరోధాలను దాటేందుకు, మైదానంలో దిగేందుకు, కొత్త శిఖరాలు చేరుకునేందుకు మిథాలీ ఎంతో మందికి ప్రేరణ.

అందుకే చిత్ర నిర్మాణ సంస్థ వయాకోమ్ విడియోస్ ఆమె జీవన సాఫల్య గాథను “శభాష్ మిఠూ” అనే పేరిట తెరకెక్కించనున్నారు. ఈ ప్రకటన ఆమె పుట్టిన రోజు సందర్భంగా వెలువడింది. మిథాలీ రాజ్ పాత్రను మహిళా ప్రధాన చిత్రాల హీరోయిన్ తాప్సీ పన్ను పోషించబోతోంది. రాహుల్ ఢోలకియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. వయాకోమ్ 18 విడియోస్ సీ ఓ ఓ అజిత్ అంధారే ఈ విషయాలను తెలియచేశారు.

అంధారే గతంలోనూ మహిళా ప్రధాన సినిమాలు తీశారు. ఇందులో విద్యాబాలన్ నటించిన కహానీ, కంగనా రనౌత్ క్వీన్, ప్రియాంక చోప్రా మేరికోమ్ లు ఉన్నాయి. ఈ చిత్రం చేయాలన్న ఆలోచన నిర్మాతకు హిడెన్ ఫేసెస్ అనే సినిమాను చూసినప్పుడు వచ్చింది. ఆ తరువాత తన టీమ్ తో స్క్రిప్టు పై వర్క్ చేశాడు. మిథాలీ అనుమతిని పొందాడు.

Image result for mithali raj"

“మిథాలీ జీవితం ఎంతమందికో ఆదర్శం. ఎందరో అమ్మాయిలకు ఆమె ప్రేరణ. ఈ పాత్రను టాలెంట్ కుప్పపోసినంత ప్రతిభావంతురాలైన తాప్సీ చేయబోతోంది” అని ఆయన చెప్పారు. తాను మొదటి నుంచీ మహిళా సమానత్వం, హక్కుల విషయంలో పోరాడుతూ వచ్చానని, ఈ పోరాటం కేవలం ఆటకే పరిమితం కాదని, ఇప్పుడు తన జీవితం మరికొంతమంది యువతులకు ప్రోత్సాహాన్నిస్తుందన్న ఆలోచన ఆనందకరంగా ఉందని మిథాలీ అన్నారు. మిథాలీ రోల్ ను చేయడం ఆనందంగా ఉందని, ఆమె మహిళా క్రికెట్ రూపు రేఖల్ని మార్చేసిందని, ఆమెలోని సాహసం, తనలోని తెగింపులు ఒకరికొకరిని దగ్గర చేశాయని తాప్సీ పన్నూ అంది. అజిత్ అంధారేకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.