పూర్తిగా నూత‌న న‌టీన‌టుల‌తో తెర‌కెక్కుతున్న చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌’. జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని హీరో, హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్ర ట్రైల‌ర్ ఈ రోజు విడుద‌లైంది. అంత‌కుముందు రిలీజైన ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. క్రౌడ్‌ ఫండెడ్‌ మూవీగా వస్తోన్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ను ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, మ‌హాన‌టి సినిమాల ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ విడుద‌ల చేశారు.

యూత్‌ను టార్గెట్ చేస్తూ.. రొమాన్స్ ప్రదానాంశంగా తెర‌కెక్కిన ఈ చిత్ర ట్రైల‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతుంది. ఆకట్టుకునే రొమాన్స్‌, హ‌త్తుకునే డైలాగ్స్ ట్రైల‌ర్‌లో పుష్క‌లంగా ఉన్నాయి. హీరో, హీరోయిన్ల మ‌ధ్య జ‌రిగిన‌ శృంగారాన్ని మొబైల్‌లో రికార్డ్ చేయ‌డం.. ఆ మొబైల్ మిస్స‌వ‌డం.. ఆ త‌ర్వాత వారి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం వంటి అంశాలు మ‌నం ట్రైల‌ర్‌లో చూడొచ్చు. ఈ సినిమా రీడింగ్‌ ల్యాంప్‌ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతుండ‌గా.. యశ్వంత్‌ నాగ్ అనే నూత‌న సంగీత ద‌ర్శకుడు సంగీత‌మందిస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=Pd6K4xNhB9k

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story