విశాఖలో యువతిపై మైనర్లు సామూహిక అత్యాచారం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 11:04 AM IST
విశాఖలో యువతిపై మైనర్లు సామూహిక అత్యాచారం

విశాఖ: దేశవ్యాప్తంగా అత్యచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న, కోర్టులు నిందితులకు జైలు శిక్షలు విధిస్తున్న.. కామాంధుల ధోరణి మారడం లేదు. విశాఖ పట్నంలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై మానవ మృగాలు అత్యచారానికి తెగబడ్డాయి. మానవత్వం మరిచి దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. నమ్మి బయటకు వచ్చిన యువతికి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఇచ్చారు. అనంతరం యువతి అపస్మారక స్థితికి చేరుకున్నాక సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం.

Next Story