8 ఏళ్ల చిన్నారిపై బలవంతంగా అత్యాచారం.. పట్టించుకొని పోలీసులు

By Newsmeter.Network  Published on  12 Jan 2020 5:48 AM GMT
8 ఏళ్ల చిన్నారిపై బలవంతంగా అత్యాచారం.. పట్టించుకొని పోలీసులు

తూర్పుగోదావరి: కాకినాడలో దారుణ ఘటన అమానుష ఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై జగన్నాథం అనే 45 ఏళ్ల వ్యక్తి దారుణ అత్యచారానికి ఒడిగట్టాడు. తారకరామనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడి కూతురితో కలిసి బాధితురాలైన బాలిక అతడి ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే ఆ బాలికపై మృగాడి కన్ను పడింది. కూతురిని కిరాణ షాపుకు పంపించి, బాలికను ఇంటి లోపలికి తీసుకెళ్లి తలుపులు వేసి ఆపై అత్యచారం చేశాడు. అప్పటికే నిందితుడి కూమార్తె ఇంటికి చేరుకుంది. ఇంటి లోపలి నుంచి బాధితురాలు కేకలు వేడయంతో తలుపులను కొట్టింది. అయిన నిందితుడు తలుపులు తెరవలేదు.

దీంతో వెంటనే నిందితుడి కుమార్తె.. నేరుగా బాధితురాలి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అక్కడికి చేరుకున్న వారు తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే నిందితుడు వెనుక తలుపులు తెరిసి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు కాకినాడ్‌ పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు డీఎస్పీ రవివర్మకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ వెంటనే స్పందించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దే

శంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ దిశ ఘటన జరిగిన నాటి నుంచి చిన్నారులపై, మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయి. కానీ మన దర్యాప్తు దళాలకు, పోలీసు బలగాలకు ఇంకా మెలకువ రాలేదు. దిశ సంఘటన జరిగి రెండు నెలలు కూడా కాలేదు. నిర్భ‌య లాంటి క‌ఠిన చ‌ట్టాలు వచ్చిన కూడా మ‌హిళ‌ల పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. ఇప్పటికీ అదే నిర్లక్ష్యం, అదే సమన్వయ రాహిత్యం అధికారుల్లో కొట్టొచ్చినట్టు కానవస్తోంది.

Next Story
Share it