తిరుపతిలో మైనర్ బాలికపై రెచ్చిపోయిన కామాంధులు
By Newsmeter.Network Published on 8 Dec 2019 5:12 PM ISTతెలుగు రాష్ట్రాల్లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఏమాత్రం ఆగడం లేదు. అధికారులు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో మైనర్ బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తిరుపతి రూరల్ మండలంలోని ముళ్లపూడి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను ఇద్దరు యువకులు మాటలతో నమ్మించి అత్యాచారానికి ఒడిగట్టారు. బైక్‌పై లిఫ్ట్ ఇస్తామంటూ బాలికను ఎక్కించుకుని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు ఈ మృగాళ్లు. తనను వదిలేయాలని బాధితురాలు ఎంత బతిమిలాడినా ఆ కామాంధులు ఏ మాత్రం కనికరించలేదు.
ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధిత కుటుంబీకులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసలు ఈ ఘటనపై ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో దిశ ఘటన తర్వాత ఎన్నో ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.