కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సంచలన ఉత్తర్వులు జారీ
By Newsmeter.Network Published on 27 Nov 2019 10:58 AM IST![కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సంచలన ఉత్తర్వులు జారీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సంచలన ఉత్తర్వులు జారీ](https://telugu.newsmeter.in/wp-content/uploads/2019/11/Ministry-of-Finance-copy.jpg)
ఢిల్లీ : ఆదాయపుపన్ను శాఖ అధికారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై వేటు వేసింది. దీనిలో భాగంగానే విశాఖ, రాజమండ్రి ఐటీఓలతోపాటు.. మరో 85 మంది అధికారులపై కేసులు నమోదు చేసింది. ఈ మేరకు రాజమండ్రిలో సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాజమండ్రి ఇన్‌కం టాక్స్ ఆఫీసరుగా పనిచేస్తున్న ఓ మహిళా అధికారిణిని వద్ద రూ.1.5లక్షల లంచం డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విశాఖపట్టణానికి చెందిన మరో ఐటీఓ అధికారి వద్ద రూ. 75వేల లంచం డబ్బు దొరికింది. దీంతో ఇద్దరు ఆదాయపుపన్ను శాఖ అధికారులకు నిర్బంధ పదవీ విరమణ చేయిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. మరో 21 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారులను నిర్బంధంగా పదవీవిరమణ చేయిస్తూ.. రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఈ ఏడాది ఐదు విడతలుగా మొత్తం 85 మంది ఆదాయపు పన్నుశాఖ అవినీతి అధికారులపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వేటు వేసింది. ఇందులో 64 మంది సెంట్రల్ బోర్డు, కస్టమ్స్, సీబీడీటీ స్థాయి ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.