మంత్రి కొడాలి నాని తప్పుగా మాట్లాడారు: సోమువీర్రాజు
By అంజి Published on 21 Nov 2019 3:18 PM ISTఅమరావతి: చంద్రబాబు, జగన్‌కు మతపరమైన విధానంలో తేడా లేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. మతపరమైన ఓటు బ్యాంక్‌ను రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ మత ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వ్యతిరేకమని సోము వీర్రాజు తెలిపారు. పాస్టర్లకు, ఇమాంలకు జీతాలు ఇస్తామని చంద్రబాబు, జగన్ ఇద్దరు అన్నారు. అవినీతి అక్రమాల కేసులు వున్నవారిని మేం తీసుకొకూడదంటే ఎలా? మేం బలపడాలి.. మేం కూడా పరిపాలించాలనుకుంటున్నాం. మమ్మల్ని మాత్రమే కరెక్ట్‌గా ఉండమంటే ఎలా ? అంటూ సోము వీర్రాజు ప్రశ్నించారు.
తెలుగు తీసేస్తామనే హక్కు ఎవరికీ లేదు.. ఇంగ్లీష్ మీడియం అమలుపై తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలన్నారు. వైసీపీ ఎంపీలు బీజేపీ అధినాయకత్వంతో టచ్‌లో ఉన్నారని సోము వీర్రాజు తెలిపారు. ఎంత మందికి బీజేపీలోకి వస్తారు అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. క్రిష్టియానిటీని ప్రోత్సహించేందుకే ఇంగ్లీషు మీడియం తీసుకువస్తున్నారు అన్న కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలకు వివరణను ఆయన్నే అడగాలన్నారు. టీటీడీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికాదని సోము వీర్రాజు అన్నారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు.