ఆ కేసును నాంపల్లి కోర్టుకు బదిలీ చేయండి: అక్బరుద్దీన్ ఓవైసీ
By అంజి Published on 10 Dec 2019 3:33 PM ISTనిర్మల్ జిల్లా కోర్టుకు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అజీంబీన్ యహియా హాజరయ్యారు. 2012, నిర్మల్ సభలో హిందూ దేవతలపై అక్బరుద్దీన్ విద్వేష పూరిత ప్రసంగం చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇవాళ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ తన అనారోగ్యం దృష్ట్యా కేసును నాంపల్లి కోర్టుకు బదిలీ చేయాలని కోరారు. నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్బరుద్దీన్ ప్రసంగం తీవ్ర వివాదాలకు కారణమైంది. హిందూ దేవతలపై విద్వేష పూరితంగా మాట్లాడారు. అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్బరుద్దీన్‌పై పోలీస్ కేసు నమోదైన కూడా పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల సమయంలో నిర్మల్ జిల్లాలో ఎంఐఎం సభ నిర్వహించకుండా ఉండేందుకు రూ.25 లక్షలు ఆఫర్ చేసిందని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి.