హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజు సందర్భంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీతో పాలు పలు ప్రాంతాల్లో సమావేశాలు, అన్నదానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీల్లో, సభల్లో డీజేలకు పోలీసులు అనుమతిని ఇవ్వలేదు.

కొమరోలులోని రహమత్‌నగర్‌లో మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. మదరసా విద్యార్థులకు భక్తి పోటీలు, ఖురాన్‌ పుస్తక పఠన పోటీలు నిర్వహించారు. మిలాన్‌-ఉన్‌-నబీ సందర్భంగా టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం చంద్రబాబు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ గవర్నర్‌ తమిళసై, సీఎం కేసీఆర్‌ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నమ్మకం, కరుణ, సంరక్షణ పేరుతో సేవ చేసినప్పుడే మహ్మద్‌ ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని తమిళ సై పేర్కొన్నారు. ప్రేమ, సోదరభావం పెంపెందించేలా మహ్మద్‌ ప్రవక్త కృషి చేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.