హైదరాబాద్‌: నగరంలో దొంగల బెడద రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా నగరాన్ని దొంగలు దోచుకుతింటూ.. నగర వాసులకు, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. శంషాబాద్‌లో సోమవారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్లల్లోకి చొరబడి నగదును దొంగలు అపహరించుకుపోయారు. పెద్దషాపూర్‌ గ్రామంలో బొద్దం రాజు ప్రమోద్‌ పటేల్‌ ఇళ్లల్లోకి చొరబడిన దుండగులు ఐదు తులాల బంగారం, రూ.30 వేల నగదును ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీమ్‌ను రంగంలోకి దింపారు. దొంగతనం జరిగిన తీరుపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.