తలకిందులు తపస్సు చేసినా ఆ జట్టు టైటిల్ గెలవలేదు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Nov 2020 11:39 AM GMT
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆర్‌సీబీ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్, ముంబై మ్యాచ్ ఫలితం తర్వాత ఇది మారొచ్చు. అయితే.. బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరినా టైటిల్ మాత్రం గెలవలేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ అన్నాడు. ఆ జట్టుకు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచే సత్తా లేదని అభిప్రాయపడ్డాడు.
తాజాగా క్రిక్‌బజ్ తో మాట్లాడుతూ వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ జట్టు తలకిందులు తపస్సు చేసినా టైటిల్ గెలవలేదన్నాడు. ఫస్ట్ నుంచి తాను అదే చెబుతున్నానని.. ఆర్‌సీబీలో ఫైర్, పవర్ ఉన్న ఆటగాళ్లు లేరని, అంతేకాకుండా ఆ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉందన్నాడు. ఆర్‌సీబీ గెలవాలంటే చేయాల్సింది ఒక్కటే.. దూకుడుగా ఆడుతూ ఆఖరి బంతి వరకు పోరాడాలిని వాన్ సూచించాడు.
Also Read
గేల్ కు జరిమానా.. అలా ఎందుకు చేశాడో..!Next Story