గేల్ కు జరిమానా.. అలా ఎందుకు చేశాడో..!

By సుభాష్  Published on  31 Oct 2020 12:11 PM GMT
గేల్ కు జరిమానా.. అలా ఎందుకు చేశాడో..!

కింగ్స్ లెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో మంచి హిట్టింగ్ ను క్రికెట్ అభిమానులు ఆస్వాదించారు. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ జ‌ట్టులో క్రిస్‌ గేల్‌ (63 బంతుల్లో 99; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (41 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్‌ (10 బంతుల్లో 22; 3 సిక్సర్లు) రాణించారు. రాజస్తాన్‌ రాయల్స్ బౌల‌ర్ల‌లో ఆర్చర్, స్టోక్స్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 186 పరుగుల విజ‌య‌ లక్ష్యంతో బ‌రిలో దిగిన రాయ‌ల్స్‌.. ఆది నుండి ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెన్‌ స్టోక్స్‌ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ సామ్సన్‌ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో 17.3 ఓవర్లలోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (20 బంతుల్లో 31 నాటౌట్‌; 5 ఫోర్లు), బట్లర్‌ (11 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఉతప్ప (30; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు.

పంజాబ్ జట్టు 185 పరుగులు చేయగా.. క్రిస్ గేల్ 99 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ వేసిన మూడో బంతిని సిక్సర్ గా మలిచి 99 పరుగులకు చేరాడు. ఆ తర్వాతి బంతికి గేల్ ను ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆగ్రహాన్ని తట్టుకోలేక బ్యాట్ ను విసిరికొట్టాడు. ఆ తర్వాత ఆర్చర్ ను మెచ్చుకుంటూ పెవిలియన్ కు చేరుకున్నాడు. ఐపీఎల్ నిబంధనల మేరకు బ్యాట్ ను విసిరికొట్టడం రూల్స్ కు విరుద్ధం. గేల్ కు ఐపీఎల్ యాజమాన్యం మ్యాచ్ ఫీజులో కోత విధించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడంటూ క్రిస్ గేల్స్ కు ఐపీఎల్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది.

ఈ మ్యాచ్‌లో గేల్‌ సెంచరీని తృటిలో కోల్పోయాడు. 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 99 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. జోఫ్రా ఆర్చర్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ నాల్గో బంతికి గేల్‌ బౌల్డ్‌ అయ్యాడు. బంతి బ్యాట్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లి వికెట్లను గిరాటేసింది. దాంతో అసహనానికి గురైన గేల్‌ బ్యాట్‌ను విసిరేశాడు.

Next Story