మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా స్ట్రెస్‌కి గురయ్యా - ఈషారెబ్బ‌

By అంజి  Published on  21 Nov 2019 7:39 AM GMT
మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా స్ట్రెస్‌కి గురయ్యా - ఈషారెబ్బ‌

‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి ‘బందిపోటు’,’అమీతుమీ’.’అ!’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న క‌థానాయిక‌ ఈషా రెబ్బ. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’లో నటించింది. తాజాగా శ్రీనివాస‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రాగ‌ల 24 గంట‌ల్లో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇందులో స‌త్య‌దేవ్ కి స‌ర‌స‌న న‌టించింది.

వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా గురించి ఈషారెబ్బ స్పందిస్తూ.. మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో అవకాశాలు రావడం చాలా అరుదు. నాకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో అందరి టెన్షన్స్ తనే తీసుకునే విద్య అనే పాత్రలో కనిపిస్తాను. జనరల్ గా నేను ఏ కథ విన్నా ముందే విజువలైజ్ చేసుకుంటాను.

ఈ కథ చెప్పినప్పుడు కూడా విజువల్ గా ఊహించుకున్నాను. బాగా నచ్చింది. కథ మొత్తం నా క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. దాంతో సినిమా మొత్తం నా భుజాలపై మోయాల్సి వచ్చింది. అలాగే నా పాత్రలో స్ట్రగుల్, ఫైట్, కోపం లాంటి చాలా ఎమోషన్స్ ఉంటాయి. దీంతో మెంటల్ గా, ఫిజికల్ గా చాలా స్ట్రెస్ కి గురయ్యాను. తరువాత అవుట్ ఫుట్ చూశాక హ్యాపీ గా అనిపించింది. తెలుగు అమ్మాయిగా ఉండటం వలన అవకాశాలు రావడం లేదా అని అడుగుతుంటారు.. నేను అలా అనుకోవడం లేదు. తెలుగు అమ్మాయిలు కూడా అన్ని రకాల పాత్రలలో అద్భుతంగా నటించగలరు అని నిరూపించాలని, నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను అన్నారు.

Next Story
Share it