పురుషులు ఆ సమస్యతో తెగ ఇబ్బంది పడిపోతున్నారట
By రాణి Published on 12 April 2020 5:01 PM IST- ప్లీజ్..ఒక్కరోజు సెలూన్స్ ఓపెన్ చేయించండి
లాక్ డౌన్ కారణంగా అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్నా, చితకషాపులను కూడా పోలీసులు మూసివేయిస్తున్నారు. మార్చి 23వ తేదీ నుంచి లాక్ డౌన్ అమల్లోకి రాగా..20 రోజుల నుంచి దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసరాలైన పాలు, కూరగాయలు, కిరాణా సామాగ్రి మినహా ఇంకెలాంటివీ దొరకట్లేదు. లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు మగాళ్లకు ఓ పెద్ద సమస్యొచ్చి పడింది. 20రోజులుగా ఇళ్లలోనే ఉంటున్నారు కదా బయటికి వెళ్లడం కుదరక ఇబ్బంది పడుతున్నారనుకుంటున్నారా ? కాదు కాదు..గుబురుగా పెరిగిన జుట్టు, గడ్డం, మీసాలతో తెగ ఇబ్బంది పడిపోతున్నారు. కొంతమందైతే గడ్డం, మీసాలను ఇళ్లలో ట్రిమ్మింగ్ చేసుకున్నా..హెయిర్ కటింగ్ మాత్రం చేసుకోలేం అంటున్నారు.
Also Read : దేవుడిని నమ్మండి..ఓ గుడ్డ మీద నమ్మకం పెట్టుకోకండి అన్నాడు..ఆ తర్వాత..?
బయట హెయిర్ సెలూన్లలో చేసే రకరకాల స్టైల్స్ కు అలవాటుపడినవారైతే చాలా అవస్థ పడుతున్నారు. మా జుట్టు చూడండి. పిచ్చుక గూడులా అయిపోతోంది. ఒక్కసారి సెలూన్ షాపులను తెరిపించండి మోడీ గారూ అంటూ టిక్ టాక్ లు, ట్వీట్స్ చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని మరీ ఇంట్లోనే క్రాఫ్ చేసుకునే వారూ ఉన్నారు. అదెలా అంటారా ?
ఈ ఫొటో చూడండి. ఇంట్లో ఉన్నవారికే వీడియో కాల్ చేసి..ఆ వీడియో కాల్ లో చూస్తూ తన బ్యాక్ సైడ్ హెయిర్ ను కట్ చేసుకుంటున్నాడు. ఇది చూసిన నెటిజన్లు..దేవుడా ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయంటూ ట్రోల్స్ చేస్తున్నారు.