కరోనా ఎఫెక్ట్: ఆ ఒక్క రోజు బస్సులు బంద్
By సుభాష్ Published on 20 March 2020 3:01 PM ISTకరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవ్వరిని కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఈ కరోనా బారిన పడి 10వేల వరకు మృత్యువాత పడ్డారు. 2లక్షలకుపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రమత్తమై పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ అన్నీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాయి. ఈ దేశాలు మార్చి 31 వరకు అమల్లో ఉండనుంది.
Also Read
భారత్లో ఐదో కరోనా మరణంఇక తాజాగా మేఘాలయా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక్కరోజు పూర్తిగా ప్రజా రవాణాపై ఆంక్షలు విధించాలని వెల్లడించింది. మార్చి 20 అర్ధరాత్రి నుంచి మార్చి 21 అర్ధరాత్రి వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని పేర్కొంది. దాంతోపాటు దుకాణాలు, మార్కెట్లు సైతం మూసివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 209 కరోనా కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు.
Next Story