పోలవరం లో 'మేఘా శకం' ఆరంభం..!!
By Newsmeter.Network Published on 21 Nov 2019 2:45 PM ISTపోలవరం, ప.గో. జిల్లా:
పోలవరం కాంక్రీట్ పనులను ఎంఈఐఎల్ ప్రారంభించింది. రోజుకు రోజుకు రెండు వేళా క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనుల లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ నాటికి కాంక్రీట్ పనుల పూర్తికి సన్నాహాలు ప్రారంభించారు ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముఖ్యమైన కాంక్రీట్ పనులను ప్రారంభించింది. ఈ నెల ఒకటో తేదీన ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు మేఘా సంస్థ భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో మేఘా సంస్థ పాల్గొన్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్ట్ పనులను 12.6శాతం తక్కువకు కోట్ చేసి దక్కించుకున్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి రూ. 782 కోట్లు ఆదా అయింది.
గతంలో పనులు చేసిన నవయుగ సంస్థ రివర్స్ టెండర్లపై హై కోర్టును ఆశ్రయించింది. తొలుత స్టే విధించిన ఉన్నత న్యాయస్థానం ఆ తరువాత స్టే ఎత్తివేసింది. దీంతో ఈ నెల ఒకటో తేదీన ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుంది. ఆ వెంటనే భూమిపూజ చేసింది.
ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల వాళ్ళ దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం లోని రోడ్లను మరమ్మతులు చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆ ప్రాంతాన్ని నిర్మాణానికి అనుకూలంగా తీర్చిదిద్దింది. తాజాగా కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టింది. స్పిల్ వే ప్రాంతంలో పనులను గురువారం ప్రారంభించింది.
ముందుగా నిర్ణయించిన సమయానికి కాంక్రీట్ వేయటం ప్రారంభించిన మేఘా సంస్థ ప్రతినిధులు తోలి రోజు 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు. ఈ పరిమాణాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ పోతామని మేఘా ఇంజనీరింగ్ సంస్థ జనరల్ మేనేజర్ సతీష్ బాబు అంగర తెలిపారు. ప్రస్తుతం స్పిల్ వే వద్ద పనులు కొనసాటుతున్నాయి.
ఇంకా వర్షం నీటిలోనే పోలవరం ప్రాజెక్ట్...
పోలవరం ప్రాజెక్ట్ నిర్మించే ప్రాంతం లో ప్రస్తుతం నీరు ఎక్కువగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు నిర్మాణ ప్రాంతం అంటా జలమయమైంది. ఆ నీటిని తోలుత సాధారణ ప్రవాహంగా తగ్గించే ఏర్పాట్లను మేఘా సంస్థ చేసింది. నీటి మట్టం కొంత తగ్గిన తరువాత మోటార్లను ఉపయోగించి ఆ నీటిని నిర్మాణ ప్రాంతం నుంచి పూర్తిగా తొలగిస్తామని సతీష్ చెప్పారు. స్పిల్ వే లో మూడు లక్షల క్యూబిక్ మీటర్ల పనులు ఇంకా చేయాల్సి ఉంది.
స్పిల్ ఛానల్ లో 5. 3లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాలి. స్పిల్ చానల్ లో నీటి నిల్వ ఎక్కువగా ఉంది. ఈ నీరు తగ్గిన తరువాత అక్కడ పనులు చేపడతారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ , కాపర్ డ్యామ్ పనులను ఒకదాని వెనుక ఒకటి ప్రారంభిస్తామని సతీష్ బాబు చెప్పారు. రాక్ ఫిల్ డ్యామ్ లో 1. 50 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులను చేయాల్సి ఉంది. ఈ పనులను వచ్చే సీజన్లో అంటే 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని సతీష్ చెప్పారు. స్పిల్ వే పనులు 2020 జూన్ నాటికి పూర్తి చేస్తామని వివరించారు.