మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సరికొత్త లుక్‌తో తన అభిమానులను ఆశ్చర్య పరిచారు. గుండు బాస్‌గా కనపడి అందరికి షాక్ ఇచ్చారు. ఈ లుక్‌లో చిరు గుండుతో, మీసాలు లేకుండా నల్ల కళ్లద్దాలతో కనిపించారు. దీనికి అర్భన్ మాంక్ లుక్ అనే పేరుపెట్టారు. ఈ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా చిరంజీవి తన లుక్ వెనుకున్న సీక్రెట్‌ను రివీల్ చేశారు.