200 మందితో విజయ్ దేవరకొండ 'మీకు మాత్రమే చెప్తా' ప్రమోషనల్ సాంగ్ రిలీజ్

By Medi Samrat  Published on  25 Oct 2019 1:56 PM GMT
200 మందితో విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా ప్రమోషనల్ సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ "కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్" పతాకంపై రూపొందిన సినిమా "మీకు మాత్రమే చెప్తా" . ఈ మూవీ మ్యూజిక్ వీడియో "నువ్వే హీరో" సాంగ్ లాంచ్ విజయ్ ఫాన్స్ చేతుల మీదుగా జరిగింది. ఫ్యాన్స్ ని ఫ్యామిలీ గా ట్రీట్ చేసే హీరో విజయ్ దేవరకొండ తాను ప్రొడ్యూస్ చేస్తున్న మొదటి మూవీ మ్యూజిక్ వీడియా "నువ్వే హీరో" ని ఫాన్స్ తో లంచ్ చేయించారు. ఎఎమ్‌బి మాల్ లో జరిగిన ఈ ఈవెంట్ విజయ్ ఫాన్స్ సందడి చేశారు . రెండు వందల మంది విజయ్ దేవరకొండ ఫాన్స్ ప్రత్యేక అతిధులు గా మరిన ఈ మ్యూజిక్ వీడియో లంచ్ లో నవాబ్ రాప్ గ్యాంగ్ పాడిన పాట హైలెట్ గా మారింది. వారితో కలిసి విజయ్ స్టెప్స్ వేశారు.

19e07d1a D79d 42f6 A5ec E8ef234acc09

ఈ సందర్భంగా విజయదేవరకొండ మాట్లాడుతూ.. ఈ ప్రమోషనల్ సాంగ్ కోసం నేను చాలా కష్ట పడ్డాను. మా కొరియోగ్రాఫర్ విజయ్ నాకంటే ఎక్కువ శ్రమ తీసుకున్నాడు. తరుణ్, అభినవ్ గోమటం కూడా నాతో స్టెప్స్ వేయాలి కానీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తో కుదరలేదు. ఈ మూవీ ఆడియో రైట్స్ తీసుకున్న ఆదిత్య మ్యూజిక్ కి పెద్ద థాంక్స్ ..ఉమేష్ గుప్త గారు ఈ ఈవెంట్ కి వచ్చినందుకు థాంక్స్. కొత్త వారు ఐయినా ప్రయత్నానికి ఉమేష్ అందించిన సహకారం మర్చిపోలేను. శివ మంచి మ్యూజిక్ అందించాడు. తరుణ్ యాక్టింగ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అభినవ్ బాగా ఎంటర్టైన్ చేసాడు. నవంబర్ 1 న విడుదల అవుతుంది. మీకు బాగా నచ్చుతుంది అని నమ్ముతున్నాను " అన్నారు. 927f227a 819d 46ed A9cf 07f39c6249e6

Advertisement

ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా మాట్లాడుతూ.. గీతా గోవిందం, టాక్సీవాలా ఆడియో ఆదిత్య ద్వారా రిలీజ్ చేసాము. 'మీకు మాత్రమే చెప్తా' ఆడియోను మాపై నమ్మకం తో ఇచ్చిన ప్రొడ్యూసర్ వర్ధన్ దేవరకొండకు థాంక్స్. విజయ్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ మాట్లాడుతూ : " ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది అని నమ్ముతున్నాను. తరుణ్ బాగా యాక్ట్ చేసాడు, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి ఎంటర్టైనర్ తో నవంబర్ 1న మీ ముందుకు వస్తున్నాం " అన్నారు.

Next Story
Share it